Watch: ‘మా గ్రామానికి ఏమైంది’.. నెలలోనే ఐదుగురు మృతి.. అడవి బాట పట్టిన ప్రజలు..

ఆ గ్రామంలో ఏమైందో ఏమో కానీ.. ఒకే నెలలో ఐదుగురు మరణించారు. దీంతో గ్రామస్తులు ఏమైందోనంటూ భయపడ్డారు. వెంటనే పురోహితుడి దగ్గరికి వెళ్లారు.. ఆయన మొత్తం విషయం విని.. గ్రామానికి కీడు సోకిందని చెప్పారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు పురోహితుడు..

Watch: ‘మా గ్రామానికి ఏమైంది’.. నెలలోనే ఐదుగురు మృతి.. అడవి బాట పట్టిన ప్రజలు..
Rajanna Sircilla News

Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 10, 2025 | 9:25 AM

ఆ గ్రామంలో ఏమైందో ఏమో కానీ.. ఒకే నెలలో ఐదుగురు మరణించారు. దీంతో గ్రామస్తులు ఏమైందోనంటూ భయపడ్డారు. వెంటనే పురోహితుడి దగ్గరికి వెళ్లారు.. ఆయన మొత్తం విషయం విని.. గ్రామానికి కీడు సోకిందని చెప్పారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు పురోహితుడు.. ప్రజలంతా ఒక్కరోజు గ్రామాన్ని వదిలి వెళ్లాలని, అక్కడే వంటలు చేసుకుని తినాలంటూ సూచించారు. దీంతో గ్రామస్థులు మొత్తం ఏకంగా ఇండ్లకు తాళాలు వేసి ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో గత నెల రోజుల నుంచి ఐదుగురు మృతి చెందారు. దీంతో తమ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని భావించిన గ్రామస్థులు గ్రామ పురోహితుడిని అడుగగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఇళ్లకు తాళాలు వేసి వనభోజనాలకు వెళితే కీడు పోతుందని చెప్పడంతో గ్రామ ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వనభోజనాలకు వెళ్ళారు.. సూర్యుడు ఉదయించే కంటే ముందు గ్రామం విడిచి వెళ్లిపోయారు. పొలాల వద్దనే వంటలు చేసుకున్నారు. పిల్లలు, పెద్దా అనే తేడా లేకుండా అందరూ గ్రామం విడిచి వెళ్లిపోయారు. అక్కడే వంటలు చేసుకుని.. తిన్నారు. దీంతో ఊరు మొత్తం ఖాళీగా కనిపించింది.

వీడియో చూడండి..

సూర్యుడు అస్తమించిన తరువాత మళ్ళీ ఇళ్లకు చేరుకున్నారు. వరుస మరణాల కారణంగా ఇంకా ఈ గ్రామం లో భయమే కనబడుతుంది. ఎదో కీడు కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇలాంటి నమ్మవద్దని.. అధికారులు మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అనారోగ్య సమస్యతో చనిపోయి ఉంటారని..కీడు లాంటి ప్రచారం నమ్మవద్దని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..