Telangana: చిన్నారి ప్రాణాలు తీసిన రూ.5 కాయిన్.. భూదాన్ పోచంపల్లిలో విషాదం.. అసలేమైందంటే..?

|

Jul 06, 2022 | 2:36 PM

భూదాన్‌ పోచంపల్లి పట్టణం వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారం రోజుల క్రితం చిన్న కుమార్తె చైత్ర (4) ఇంటివద్ద ఆడుకొంటూ రూ.ఐదు కాయిన్ మింగింది.

Telangana: చిన్నారి ప్రాణాలు తీసిన రూ.5 కాయిన్.. భూదాన్ పోచంపల్లిలో విషాదం.. అసలేమైందంటే..?
Bhoodan Pochampally
Follow us on

Child Died After Swallowing Five Rupees Coin: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ రూ.5ల కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన భూదాన్ పోచంపల్లి (bhoodan pochampally) లో జరిగింది. భూదాన్‌ పోచంపల్లి పట్టణం వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారం రోజుల క్రితం చిన్న కుమార్తె చైత్ర (4) ఇంటివద్ద ఆడుకొంటూ రూ.ఐదు కాయిన్ మింగింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిలలాడింది. తీవ్రంగా ఏడుస్తుండటంతో.. చైత్రను తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీశారు. దీంతో కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ క్రమంలో చిన్నారి సోమవారం మరోసారి అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు చైత్రను తీసుకోని అదే ఆసుపత్రికి పయనమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే ఛైత్ర ప్రాణాలు కోల్పోయింది. ఐదు రూపాయల కాయిన్ గొంతులు ఇరుక్కోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ముద్దుముద్ద మాటలతో అల్లరి చేస్తూ ఆడుకునే చైత్ర అకస్మాత్తుగా తనువు చాలించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో భూదాన్ పోచంపల్లిలో విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం