కీరదోసకాయ మామూలుగా ఎంత సైజ్ ఉంటాయి. జానెడు లేదా మహా అయితే, మూరేడు కూడా ఉంటాయి కావొచ్చు.. కానీ,ఇక్కడ చూశారా… ఎంత పెద్దగా ఉందో…3 అడుగుల కిరా దోసకాయ అందర్నీ ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు ఆ ఊర్లోని వారందరూ క్యూ కడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో పండింది ఈ అరుదైన కీరదోస..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని పూసాల గ్రామంలో పొడవైన కీర దోస కాయలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పూసాల గ్రామానికి చెందిన కనుకుంట్ల రాజయ్య విద్యుత్ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే, తన ఇంటి వద్ద ఖాళీ స్థలంలో కీరదోస విత్తనాలు నాటారు. ప్రస్తుతం కీర దోసకాయలు ఒక్కొక్కటి రెండున్నర నుంచి మూడు ఫీట్ల పొడుగు ఉన్నాయి. ఒక్కో కాయ మూడు నుంచి నాలుగు కిలోల బరువుతో ఉందని రాజయ్య చెబుతున్నారు.
అయితే, ఇలాంటి అరుదైన దోస కాయను ఇంతవరకు చూడలేదని, పెద్దసైజ్‌లో పండిన కీరాదోసకాయలు చూస్తుంటే సంతోషంగా ఉందంటున్నారు. ఇంతపెద్ద దోసకాయల్ని చూసేందుకు పూసాల గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Also Read: కలలో మంటల్లో తగలబడుతున్న ఇల్లు కనిపించిందా.? అది దేనికి సంకేతమో తెలుసుకోండి.!