
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాంతో బస్సుల్లో మహిళల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది.
ఇక ఇప్పుడు మరి కొంతమంది ఆర్టీసీ ప్రయాణికులకు కూడా టీజీఎస్‌ఆర్టీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణ ఛార్జీలో ఏకంగా 10 శాతం రాయితీని ప్రకటించింది. అయితే ఇది అన్ని రూట్లలో కాదు. తెలంగాణ నుంచి బెంగళూరుకు ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో పది శాతం రాయితీ కల్పిస్తున్న ప్రకటించింది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకూ ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ని సంప్రదించాల్సింది సూచించారు.
అయితే తెలంగాణ నుంచి చాలా మంది బెంగళూరు సిటీకి వెళ్తుంటారు. వ్యాపార పనులపై, అలాగే ఉద్యోగ రిత్యా అక్కడ పనిచేసే వారు కూడా తరచూ బెంగళూరుకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు టీజీఎస్ ఆర్టీస్ ప్రకటించిన ఈ రాయితీ ఎంతో మేలు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఒక్క బెంగళూరుకు వెళ్లే రూట్‌లోనే ఈ రాయితీని అమలు చేయడం వల్ల మిగతా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి విమర్శలు రావొచ్చు. అన్ని రూట్లలోనూ ఈ రాయితీని అమలు చేయాలనే డిమాండ్ కూడా వినిపించే అవకాశం ఉంది. మరి తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త!!
బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీని #TGSRTC యాజమాన్యం కల్పిస్తోంది.
బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 17, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.