
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. యూట్యూబ్ లో షార్ట్స్, పాడ్‌కాస్ట్, లైవ్‌స్ట్రీమింగ్స్ చేసేవాళ్లు ఇకపై కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్‌ను వాడుకోవచ్చు. గూగుల్ వియో 3 పేరుతో లాంఛ్ అయిన ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే..
వియో3 అనేది ఒక ఏఐ వీడియో మోడల్. దీని ద్వారా యూట్యూబ్ క్రియేటర్లు వీడియో బ్యాక్‌గ్రౌండ్లు, సౌండ్‌తో కూడిన క్లిప్‌లను ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. 480పీ క్వాలిటీ వరకూ వీడియోలు ఫ్రీగా జనరేట్ అవుతాయి. ఎక్కువ రెజల్యూషన్ కావాలంటే కొంత చెల్లించాల్సి ఉంటుంది.
క్రియేటర్లు వీడియో క్రియేట్ చేసేటప్పుడు టాప్‌లో కుడివైపు కనిపించే స్పార్కిల్(sparkle) ఐకాన్ పై క్లిక్ చేస్తే ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా స్టిల్ ఫొటోలను వీడియోస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియోలకు ‘పాప్ ఆర్ట్’ లేదా ‘ఒరిగామి’ వంటి లుక్స్ ఇవ్వొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ప్రాంప్ట్ ద్వారా క్యారెక్టర్ డిజైన్, ఇతర ఎఫెక్ట్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పాడ్ కాస్ట్ లు చేసేవాళ్లు ఈ టూల్ ద్వారా తమ ఫుల్ వీడియోల నుంచి షార్ట్స్ , క్లిప్స్ ఈజీగా కట్ చేసుకుని అప్ లోడ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ తో పాడ్ కాస్ట్ చేసేవాళ్లు ఈ ఏఐ టూల్ ద్వారా కస్టమైజ్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.
ఇకపోతే లైవ్‌స్ట్రీమింగ్ చేసేవాళ్లు కూడా ఈ ఏఐ టూల్ ను పలు రకాలుగా వాడుకోవచ్చు. లైవ్‌స్ట్రీమ్ చేస్తూనే గేమ్స్ ఆడటం, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ కావడం చేయొచ్చు. అలాగే ఇక నుంచి క్రియేటర్లు వర్టికల్ గా కూడా లైవ్‌స్ట్రీమ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రావొచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి