AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.724కే పవర్‌‌ఫుల్ సౌండ్‌బార్‌‌.! అదిరిపోయే ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌.. పూర్తి వివరాలివే

YOROTO YO-413BT Wireless Soundbar.. ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. కానీ మంచి స్పీకర్ కొనాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా మంది వెనకాడతారు. అలాంటి వారి కోసం మార్కెట్లో అద్భుతమైన బడ్జెట్ డివైజ్ అందుబాటులోకి వచ్చింది.

రూ.724కే పవర్‌‌ఫుల్ సౌండ్‌బార్‌‌.! అదిరిపోయే ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌.. పూర్తి వివరాలివే
Yoroto Yo 413bt Wireless Soundbar
Nikhil
|

Updated on: Aug 21, 2026 | 7:30 AM

Share

తక్కువ ధరలో ప్రీమియం లుక్, అదిరిపోయే బేస్ అందించే గాడ్జెట్ల కోసం వెతుకుతున్న వారికి ఈ సరికొత్త వైర్‌లెస్ సౌండ్‌బార్ చక్కటి ఎంపికగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ స్పీకర్ విశేషాలను తెలుసుకుందాం.

స్టైలిష్ డిజైన్

ఈ సౌండ్‌బార్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. దీని ముందు భాగంలో వచ్చే ఆర్జీబీ లైట్లు దీని లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి. చీకటి గదిలో పాటలు వింటున్నప్పుడు ఈ లైట్ల ఎఫెక్ట్ ఒక చిన్న పార్టీ హాల్ లాంటి ఫీల్ ఇస్తుంది. కాంపాక్ట్ సైజ్ కారణంగా దీనిని వర్క్ డెస్క్ మీద, టీవీ టేబుల్ పై లేదా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. కాలేజీ స్టూడెంట్ అయినా లేదా బ్యాచిలర్ రూమ్‌లో ఉంటున్నా తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లేదా ఫోన్ సౌండ్‌ని పెంచుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

అద్భుతమైన కనెక్టివిటీ

ఈ మోడల్ 20W పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఈ సైజ్ స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ ఊహించిన దానికంటే చాలా గట్టిగా, స్పష్టంగా వినిపిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన స్పీకర్ డ్రైవర్లు పంచీ బేస్‌ను అందిస్తాయి. బీట్స్ ఉన్న పాటలు వినేటప్పుడు లేదా యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు ఈ బేస్ ఎఫెక్ట్ నిజంగా మంచి థ్రిల్ ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ను క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మార్కెట్లలో ఇది కేవలం రూ. 724 ధరకే లభిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Follow Us