AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి తక్కువ ధర.. అద్భుతమైన మైలేజీ! యమహా నుంచి అదిరిపోయే స్కూటీలు

జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ భారత స్కూటర్ మార్కెట్‌లో బలపడుతోంది. ముఖ్యంగా యమహా రే ZR 125, దాని హైబ్రిడ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్ (71.33 kmpl)తో యువతను ఆకట్టుకుంటోంది. దీని అమ్మకాలు గత ఏడాది 77.79 శాతం వృద్ధి సాధించాయి.

అతి తక్కువ ధర.. అద్భుతమైన మైలేజీ! యమహా నుంచి అదిరిపోయే స్కూటీలు
Yamaha Ray Zr 125
SN Pasha
|

Updated on: Apr 21, 2026 | 3:54 PM

Share

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటర్‌ కంపెనీ భారత స్కూటర్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ, కంపెనీ తన మోడళ్లను విభిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తోంది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని Fascino 125ను అందించగా, యువతను లక్ష్యంగా చేసుకుని స్పోర్టీ లుక్‌తో Ray ZR 125ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా యమహా రే ZR 125 స్కూటర్ భారీగా ప్రాచుర్యం పొందుతోంది. సైలెంట్ ఇంజిన్, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి లక్షణాలతో ఇది యువతలో మంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంది. ఈ ప్రభావం అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

2026 మార్చిలో ఈ మోడల్ 25,798 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది అదే కాలంలో 14,510 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు 77.79 శాతం వృద్ధి నమోదైంది. ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగంగా కంపెనీ ఇటీవల ఈ స్కూటర్ ధరను స్వల్పంగా పెంచింది. సుమారు రూ.660 మేర మాత్రమే పెంపు చేయడంతో వినియోగదారులపై పెద్దగా భారం పడలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ.77,360 నుంచి రూ.83,860 వరకు ఉండగా, స్ట్రీట్ ర్యాలీ వెర్షన్ ధర రూ.87,560గా ఉంది. ధర పెరిగినప్పటికీ డిజైన్ లేదా ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

పనితీరు విషయానికి వస్తే ఈ స్కూటర్ 125cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉండే ఈ ఇంజన్ 8 bhp పవర్, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు అనువైన ఈ మోడల్ ARAI ప్రకారం 71.33 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. అదనంగా 2 సంవత్సరాల స్టాండర్డ్, 8 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీతో కలిపి మొత్తం 10 సంవత్సరాల వారంటీ ఇవ్వడం వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us