Smart Phone: షియోమి, శామ్‌సంగ్ మధ్య బీభత్సమైన పోటీ జరుగుతోంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనే దానిపై స్పష్టత లేదు కానీ.. ప్రస్తుతానికి శామ్‌సంగ్ మాత్రం పట్టునిలుపుకుంటోంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫీచర్‌లో సరికొత్త స్మార్‌ఫోన్‌ను షియోమి భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. స్మార్ట్‌ఫోన్లలో 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన తొలి సంస్థ షియోమి అవుతుంది. అయితే, శామ్‌సంగ్ కూడా తన తరువాతి ఫోన్లలో 200 మెగా పిక్సెల్ కెమెరాను ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. శామ్‌సంగ్.. ఆ దిశగా పని కూడా చేస్తుందని ప్రచారం జరిగుతోంది.
శామ్‌సంగ్‌కు ముందే షియోమి 200 ఎంపి కెమెరాతో స్మార్ట్‌ఫోన్..
అయితే, తాజాగా శామ్‌సంగ్ తన నెక్ట్స్ ఫోన్‌లో 200 ఎంపీ కెమెరా ఉపయోగించడం లేదని లీకులు వస్తున్నాయి. ఐస్ యూనివర్స్ చేసిన ట్వీట్ ప్రకారం.. శామ్‌సంగ్ తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఉపయోగించడం లేదని తేలింది. అయితే, దీనిపై ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక సమాచారం బయటకు పొక్కకుండా సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది శామ్‌సంగ్.
శామ్‌సంగ్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో.. షియోమి గనుక 200 మెగా పిక్సెల్ సెన్సార్ కలిగిన ఫోన్‌ను విడుదల చేస్తే.. సంచలనానికి కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పాలి. స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఉపయోగించిన మొదటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షియోమి అవతరించనుంది. షియోమీ విషయంలో వస్తున్న ఈ వార్తలపై మొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా? అని వేయిట్ చేస్తున్నారు. అయితే, షియోమీ కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. కానీ, రాబోయే రోజుల్లో కస్టమర్లకు సర్‌ప్రైజింగ్ ఇవ్వబోతుందని వ్యాపార వర్గాల సమాచారం. షియోమీ ప్రస్తుతం ఎంఐ 12 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోందని డిజిటల్ చాట్ స్టేషన్ పేర్కొంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ఎస్ఎం 8450 సాస్‌ని ఇవ్వగా.. 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కెమెరాను ఇస్తుందని పేర్కొన్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also read:
Premi Viswanath: సినిమాల్లోకి వంటలక్క.. స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమీ విశ్వనాథ్..?
AP Weather Report: ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు