
బడ్జెట్ లెవెల్ స్మార్ట్ వాచ్భా రతీయ వినియోగదారులకు ప్రత్యేకించినది. దీనిలో హిందీ భాషతో పాటు మోడర్న్ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిలో 2.5డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ ప్లే, షావోమీ హైపర్ ఓఎస్ ఉంటుంది. 14 రోజుల పాటు పనిచేసే విధంగా బ్యాటరీ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రెడ్ మీ వాచ్ మూవ్ ధర రూ. 1,999గా ఉంది. ప్రీ బుకింగ్స్ ఏప్రిల్ 24 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. మే ఒకటో తేదీ నుంచి సేల్ కు అందుబాటులో ఉంటుంది. షావోమీ వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంటుంది. అలాగే షావోమీ రిటైల్ అవుట్ లెట్లలో కూడా లభ్యమవుతుంది. కొనుగోలుదారులకు నాలుగు కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. అవి బ్లూ బ్లేజ్, బ్లాక్ డ్రిఫ్ట్, గోల్డ్ రష్, సిల్వర్ స్ప్రింట్.
ఈ వాచ్ 60హెర్జ్ అమోల్డ్ డిస్ ప్లే తో 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 2.5డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ ప్లే, షావోమీ హైపర్ ఓఎస్ ఉంటుంది. 14 రోజుల పాటు పనిచేసే విధంగా బ్యాటరీ ఉంటుంది. దీనిలో హిందీ భాషతో పాటు మోడర్న్ ఫీచర్లను కలిగి ఉంటుంది. పలు రకాల హెల్త్ వెల్ నెస్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. వాటిల్లో హార్ట్ రేట్ మోనిటరింగ్, ఎస్పీఓ2 ట్రాకింగ్, స్ట్రెస్, స్లీప్ మోనిటరింగ్, మెనుస్ట్రువల్ సైలిక్ ట్రాకర్ వంటివి ఉన్నాయి. అలాగే పలు రకాల ఫిట్ నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. విభిన్న స్పోర్ట్స్ మోడ్లు, టాస్క్ లు, క్యాలెండర్ ఈవెంట్లు, వెదర్ అప్ డేట్లు ఉంటాయి.
రెడ్ మీ వాచ్ మూవ్ లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో పది కాంటాక్ట్ లను డైరెక్ట్ గా డివైజ్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఐపీ68 రేటెడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. అలాగే యాంటీ అలర్జీ టీపీయూ స్ట్రాప్ తో స్టైలిష్ లుక్ తో ఇది అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి