Yoga Apps: యోగాతో ఆరోగ్య యోగం మీ చేతుల్లోనే.. ది బెస్ట్ యోగా యాప్స్ ఇవే..!

|

Jun 21, 2024 | 5:30 PM

ఇటీవల కాలంలో యోగా సాధన ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అనేక మంది వినియోగదారులు వారి యోగా ప్రయాణంలో సహాయపడటానికి వారి స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చే యాప్‌లను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగా సాధకులకు ఆండ్రాయిడ్ యాప్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా యోగాను ప్రారంభించాలనుకునే వారి దగ్గర నుంచి యోగా నిపుణులకు అవసరమైన అన్ని యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Yoga Apps: యోగాతో ఆరోగ్య యోగం మీ చేతుల్లోనే.. ది బెస్ట్ యోగా యాప్స్ ఇవే..!
Yoga
Follow us on

ఇటీవల కాలంలో యోగా సాధన ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అనేక మంది వినియోగదారులు వారి యోగా ప్రయాణంలో సహాయపడటానికి వారి స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చే యాప్‌లను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగా సాధకులకు ఆండ్రాయిడ్ యాప్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా యోగాను ప్రారంభించాలనుకునే వారి దగ్గర నుంచి యోగా నిపుణులకు అవసరమైన అన్ని యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అన్ని స్థాయిల వినియోగదారులకు వారి అభ్యాసాన్ని మెరుగుపరచడంతో అనేక రకాల టిప్స్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా డే సందర్భంగా మన స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ యాప్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం

సద్గురు యోగా అండ్ మెడిటేషన్

సద్గురు యాప్ 12 భాషల్లో ఈషా యోగా అభ్యాసాలను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ఉచిత యోగా, ధ్యాన అభ్యాసాలను పొందవచ్చు. వినియోగదారులు వివిధ అంశాలపై రోజువారీ కోట్‌లు, కథనాలు, పాడ్‌క్యాస్ట్‌లు, వీడియోలను యాక్సెస్ చేయవచ్చు. యాప్‌లో గైడెడ్ మెడిటేషన్‌లు, ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ సెషన్‌లు కూడా ఉన్నాయి. ఈ యాప్‌తో వినియోగదారులు రోజును మంచి శ్లోకాలతో ప్రారంభించవచ్చు. 

యోగా-గో

యోగా-గో అనేది అన్ని స్థాయిలకు సరిపోయే బరువు తగ్గించే వ్యాయామ యాప్ సోమాటిక్ యోగా, చైర్ యోగాతో సహా 600 ప్లస్ వర్కవుట్‌లతో ఇది వివిధ అవసరాలను తీరుస్తుంది. యాప్ వ్యక్తిగతీకరించిన రొటీన్‌లతో పాటు 7 నిమిషాల స్పీడ్ వర్కౌట్‌లు, అనేక రకాల యోగా స్టైల్‌లను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

డైలీ యోగా

డైలీ యోగా అనే యాప్ యోగాను నేర్చుకోవాలని కోరుకునే వారికి స్నేహపూర్వక విధానాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఈ యాప్ బరువు తగ్గాలనే వారికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. యాప్ వివిధ రకాల యోగా ఛాలెంజ్‌లతో పాటు తరగతులను అందిస్తుంది, వారానికొకసారి కొత్తవి జోడిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యాప్‌ను ఆఫ్‌లైన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. 

యోగా- డౌన్ డాగ్ 

60,000 కంటే ఎక్కువ కాన్ఫిగరేషన్‌లతో మీరు డౌన్ డాగ్‌లో ప్రతిసారీ ప్రత్యేకమైన యోగాభ్యాసాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఇందులో వచ్చే యోగాసనాల ద్వారా వెన్నునొప్పి ఉన్న వారికి త్వగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా పరివర్తన వేగం, హోల్డ్ పొడవు, ఇష్టపడిన లేదా మినహాయించిన భంగిమలు వంటి ఎంపికలతో మీ అభ్యాసాన్ని అనుకూలీకరించుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇది చాలా భాషల్లో అందుబాటులో ఉంది.

యోగా ఫర్ బిగినర్స్

బరువు తగ్గాలనుకునే వారికి యోగా ఫర్ బిగినర్స్ చాలా అనువుగా ఉంటుంది. ఈ యాప్ 500 ప్లస్ వర్కవుట్‌లను అందుబాటులో ఉంటాయి. ఇందులో వాల్ పైలేట్స్, బరువు తగ్గడానికి సోమాటిక్ యోగా ఉన్నాయి. ఇది నిపుణుల నేతృత్వంలోని ధ్యానంతో పాటు 30-రోజుల వర్కవుట్ ప్లానర్‌ను అందిస్తుంది. 3 స్థాయిలతో ఇది ప్రతి ఒక్కరికీ సరిపోతుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..