అడవుల్లో కోతుల కళేబరాలు ఎందుకు కనిపించవు? ఇది ప్రకృతి మాయా లేదా ఆ రాముడి వరమా!
ప్రకృతిలో ప్రతి జీవి పుట్టుక, మరణం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కోతుల మరణం, ఆ సమయంలో తోటి జీవుల ప్రవర్తించే తీరు మనుషులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అడవుల్లో వందలాది కోతులు జీవిస్తుంటాయి. కానీ వాటి మృతదేహాలు మాత్రం ఎవరీ కనిపించవు.. మరీ దీనికి కారణం ఏమిటీ.. ఆ మృతదేహాలు ఎటుపోతున్నాయి అంటే వీటి వెనుక అటు శాస్త్రీయ కారణాలు, ఇటు పురాణ గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా తమ గుంపులోని ఏదైనా కోతి చనిపోతే, మిగతా కోతులన్నీ సైలెంట్‌గా ఉండిపోతాయి. చనిపోయిన కోతి మృతదేహం చుట్టూ కూర్చుని అవి కూడా అచ్చం మనుషుల్లానే ఏడుస్తాయి. అయితే కోతుల్లో ఉండే మరో విలక్షణమైన లక్షం ఏమిటంటే.. తల్లి కోతి తన బిడ్డ చనిపోయిన విషయాన్ని అంత తేలికగా అంగీకరించలేదట.. అవును పిల్ల చనిపోయినా.. దాని కళేబరాన్ని రోజుల తరబడి, కొన్నిసార్లు వారాలపాటు గుండెలకు హత్తుకుని అలానే చెట్లపై తిరుగుతుందట.
అడవుల్లో కోతుల మృతదేహాలు ఎందుకు కనిపించవు!
సాధారణంగా అడవుల్లో వందల కొన్ని కోతులు నివసిస్తాయి. కానీ అవి చనిపోతే వాటి కళేబరాలు మాత్రం చాలా వరకు కనిపించవు. కొన్ని నమ్మకాల ప్రకారం.. అవి ఎప్పుడు చనిపోతాయి అనే విషయం కోతులకు వారం రోజుల ముందే తెలుస్తుందట. దీంతో ఆ రోజు నుంచి అవి ఉపవాసం పాటిస్తూ.. ఆహారపానీయాలు మానివేసి, ఏకాంతంగా ఒక సురక్షిత ప్రదేశంలో తపస్సులా నిశ్శబ్దంగా గడుపుతాయట. ఇక చనిపోయే క్షణాలు వచ్చినప్పుడు దట్టమైన అడవిలో చీమలు లేదా చెదపురుగుల పుట్టల వద్దకు వెళ్లి ప్రాణాలు విడుస్తాయట. ఇలా చేయడం ద్వారా వాటి కళేబరాలను చీమలు, చెదలకు ఆహారంగా సమర్పిస్తాయ. అంతేకాదు ఏదైనా ప్రమాదం జరిగి రోడ్డుపై ఇతర కోతులు మరణిస్తే.. వాటి కలేబరాలను సైతం పుట్టల వద్దకు లాక్కెళ్లి వదిలేస్తాయట.
శ్రీరాముడిని ఆంజనేయుడు కోరిన వరం?
అయితే దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ప్రచారంలో ఉంది.. అప్పట్లో ఆంజనేయ స్వామి శ్రీరాముడి దగ్గరకు వెళ్లి.. తన మరణం గురించి తనకు ముందే తెలియాలని, తన శరీరం ఎవరి కంటా పడకుండా చెదపురుగులకు ఆహారమై మట్టిలో కలసిపోవాలని వరం కోరాడని చెబుతారు. ఆ వరం వల్లే ఆంజనేయ స్వరూపంగా భావించే వానరులు సైతం నేటికీ ఆ నియమాన్ని పాటిస్తున్నాయని భక్తులు నమ్ముతున్నారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
అయితే వన్యప్రాణి నిపుణులు మాత్రం వీటి వెనక శాస్త్రీయ కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. ప్రకృతిలో ఓ సహజ పారిశుధ్య వ్యవస్థ కొనసాగుతుందని.. అడవిలోని ఏదైనా జంతువు మరణిస్తే.. వెంటనే అక్కడ ఉండే నక్కలు, చిరుతలు, ఎలుగుబంట్లు, గద్దలు ఆ కళేబరాన్ని క్షణాల్లో ఆహారంగా మార్చుకుంటాయని అంటున్నారు. అవి తిన్న తర్వాత మిగిలిన భాగాలను పురుగులు, ఈగలు, బ్యాక్టీరియాలు కుళ్ళింపజేసి మట్టిలో కలిపేస్తాయని.. చివరగా మిగిలిన ఎముకలను ముళ్ల పందులు తమ కాల్షియం అవరాల కోసం కొరికి తినేస్తాయని చెబుతున్నారు.
నేచర్ చైన్ సిస్టమ్
ఈ చైన్ సిస్టమ్ కారణంగానే అడవిలో ఏ జంతువు కళేబరమైనా ఎక్కువ రోజులు ఉండదని.. మరణించిన కొన్ని రోజులకే పూర్తిగా భూమిలో కలిసిపోతుందని చెబుతున్నారు. నమ్మకాలు ఏవైనా, ప్రకృతి తనను తాను శుభ్రపరుచుకునే ఈ విధానం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
