Whatsapp Update: యూజర్ల భద్రతకు వాట్సాప్‌ నయా ప్లాన్‌.. ఇక హ్యాకర్లకు చుక్కలే..!

|

Aug 05, 2023 | 5:00 PM

వినియోగదారుల గోప్యత, డేటాను రక్షించడానికి వాట్సాప్‌ భద్రతా చర్యలను స్థిరంగా మెరుగుపరుస్తుంది. పంపినవారు, స్వీకరించే వారి మధ్య వినియోగదారుల కంటెంట్‌ను గోప్యంగా ఉంచడానికి ఇప్పటికే వ్యక్తిగత సందేశాల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగిస్తోంది. అదనంగా వాట్సాప్ ఇటీవల ఖాతా భద్రతను పటిష్టం చేయడానికి "సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌", "చాట్ లాక్" వంటి అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Whatsapp Update: యూజర్ల భద్రతకు వాట్సాప్‌ నయా ప్లాన్‌.. ఇక హ్యాకర్లకు చుక్కలే..!
Whatsapp
Follow us on

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అలాగే కచ్చితంగా వారు అందులో వాట్సాప్‌ను వాడడం పరిపాటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. అయితే ఈ మధ్య వాట్సాప్‌ యూజర్లను హ్యాకర్లు భయపెడుతున్నారు. ఏదో రకంగా వాట్సాప్‌ను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వినియోగదారుల గోప్యత, డేటాను రక్షించడానికి వాట్సాప్‌ భద్రతా చర్యలను స్థిరంగా మెరుగుపరుస్తుంది. పంపినవారు, స్వీకరించే వారి మధ్య వినియోగదారుల కంటెంట్‌ను గోప్యంగా ఉంచడానికి ఇప్పటికే వ్యక్తిగత సందేశాల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగిస్తోంది. అదనంగా వాట్సాప్ ఇటీవల ఖాతా భద్రతను పటిష్టం చేయడానికి “సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌”, “చాట్ లాక్” వంటి అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ వాట్సాప్‌ హ్యాకర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది. దీంతో మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ వినియోగదారులకు అధిక భద్రత కల్పించేందుకు ఓ కొత్త అప్‌డేట్‌తో వస్తుంది. ఆ అప్‌డేట్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

వాట్సాప్‌ కొత్త భద్రతా పరిణామాలకు అనుగుణంగా ఖాతా ధ్రువీకరణ కోసం వినియోగదారులు వారి ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించడానికి అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తోంది. కొన్ని టెక్‌ నివేదికల ప్రకారం వాట్సాప్‌ ఈ-మెయిల్ ధ్రువీకరణ లక్షణాన్ని ఐచ్ఛికంగా ఉంచుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే మీ ఖాతాను రక్షించడానికి, ధ్రువీకరించడానికి వాట్సాప్‌ మీ ఈ-మెయిల్ చిరునామాను అడుగుతుంది. ప్రస్తుతానికి, ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాట్సాప్‌ తన ఖాతాల భద్రతను మెరుగుపరచడానికి ఈ-మెయిల్ చిరునామా ఉపయోగపడే నిర్దిష్ట పరిస్థితుల గురించి ప్రస్తుతం పరిమిత సమాచారం అందుబాటులో ఉంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో వినియోగదారులు తమ ఖాతాలను ధ్రువీకరించుకోవడంలో ఈ ఫీచర్‌ సహాయపడుతుంది.

ఉదాహరణకు ఫోన్ దొంగలించినా లేదా వినియోగదారులు వాట్సాప్‌తో లింక్ చేసిన వారి ఫోన్ నంబర్‌కు యాక్సెస్‌ను కోల్పోతే, ఈ-మెయిల్ ధ్రువీకరణ వారి ఖాతాను యాక్సెస్ చేయడానికి, అలాగే లాగిన్ చేయడానికి వారికి సహాయపడుతుంది. ఒకవేళ కొత్త పరికరంలో వాట్సాప్‌ ని సెటప్ చేసేటప్పుడు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సర్వర్ లేదా నెట్‌వర్క్ సమస్యల కారణంగా ప్రస్తుతం ధ్రువీకరణ కోడ్ రావడం లేదు. ఈ ఫీచర్ ఐచ్ఛికంగా ఉంటుందని, రెండు-దశల ధృవీకరణను కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు ఈ-ఇమెయిల్ చిరునామా కోసం అడిగే దానికంటే భిన్నంగా ఉంటుందని గమనించడం ముఖ్యం. ఈ కొత్త ఫీచర్‌ భవిష్యత్‌లో వినియోగదారులకు అందుబాటలోకి వస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..