AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ప్రొఫైల్‌కు కొత్త గ్లామర్.. అది మీ చేతుల్లోనే..

సాధారణంగా ఫేస్‌బుక్‌లో ఉన్నట్లుగానే వాట్సాప్ త్వరలో తన యూజర్ల కోసం ప్రొఫైల్‌కు కవర్ ఫోటో జోడించే కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా, యూజర్లు తమ ప్రొఫైల్ పైన ఒక పెద్ద ఫోటో పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఈ కవర్ ఫోటోను ఎవరు చూడాలి అనేది మీరే సెలక్ట్ చేసుకోవచ్చు.

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ప్రొఫైల్‌కు కొత్త గ్లామర్.. అది మీ చేతుల్లోనే..
Whatsapp Cover Photo Feature Coming Soon
Krishna S
|

Updated on: Oct 31, 2025 | 11:30 AM

Share

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడడం కామన్. ఈ యాప్ వచ్చిన నుంచి డైరెక్ట్‌గా మాట్లాడుకోవడమే తగ్గిపోయింది. ఏ విషయమైనా వాట్సాప్‌లోనే.. వాట్సాప్ కూడా తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో వాట్సాప్ త్వరలో తన వినియోగదారుల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తరహాలో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే ప్రొఫైల్‌కు కవర్ ఫోటో జోడించే అవకాశం.

కవర్ ఫోటో ఫీచర్ అంటే ఏంటీ?

సాధారణంగా ఫేస్‌బుక్ లేదా లింక్డ్‌ఇన్‌లో కనిపించే విధంగా.. యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటో పైన పెద్ద చిత్రంగా ఈ కవర్ ఫోటోను పెట్టుకోగలుగుతారు. దీని ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్‌లో ఫోటోలను ప్రదర్శించడానికి ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ అప్‌డేట్స్‌తో పాటు మరొక కొత్త స్పేస్‌ను పొందుతారు. ఇది యూజర్ ప్రొఫైల్ పైభాగంలో అందంగా కనిపిస్తుంది.

టెస్టుల దశలో ఉన్న కొత్త ఫీచర్

WABetaInfo అందించిన సమాచారం ప్రకారం.. కవర్ ఫోటో ఫీచర్‌పై వాట్సాప్ చాలా కాలంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే కొంతమందికి, బీటా వెర్షన్ 2.25.32.2 లో వాట్సాప్ దీనిని టెస్ట్ చేస్తోంది. టెస్టింగ్ పూర్తయిన వెంటనే, ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రావచ్చు. మొదటగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు వస్తుంది.

కవర్ ఫోటో ప్రైవసీ

మీరు పెట్టుకునే ఈ కవర్ ఫోటోను ఎవరు చూడాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటోకు ఉన్నట్టే, దీనికీ ప్రైవసీ సెట్టింగ్‌లు ఉంటాయి.

ఎవ్రీ వన్: ఎవరైనా సరే, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేనివారు కూడా మీ కవర్ ఫోటోను చూడొచ్చు.

మై కాంటాక్ట్స్: మీ ఫోన్‌లో నంబర్ సేవ్ చేసుకున్నవారు మాత్రమే చూడొచ్చు.

నో బడీ: మీ కవర్ ఫోటోను ఎవరికీ కనిపించకుండా పెట్టవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ ప్రొఫైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..