WhatsApp Secret tips: ఫోన్ అవసరం లేకుండా, స్మార్ట్ ఫోన్‌లో మొబైల్ డేటాను ఆన్ చేయకుండానే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లేదా వేరే ఎవరితోనైనా వాట్సప్ మెసేజ్ పంపొచ్చని మీకు తెలుసా? అవును, ఈ అవకాశం ఉంది. వాట్సప్ ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోన్ లేకుండా, ఫోన్‌లో ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ మెసేజ్ ఎలా పంపుతారు? అనేగా మీ సందేహం. అదే ఇప్పుడు తెలుసుకుందాం. మెటా యాజమాన్యంలోని ప్రసిద్ధ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్.. ఇటీవల తన వినియోగదారుల కోసం అంచనాలకు మించి ప్రత్యేకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో మీ వాట్సాప్ అకౌంట్‌ను వేర్వేరు డివైజ్‌లకు లింక్ చేయడం ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా మీ వాట్సప్‌ను ఒకటికంటే ఎక్కువ డివైజ్‌లలో ఉపయోగించొచ్చు. మొబైల్ ద్వారా లింక్ చేసిన తరువాత.. మీ మొబైల్ ఆ పరికరం వద్దనే ఉండాల్సిన అవసరం లేదు. అంటే వినియోగదారులు ఈ మల్టీడివైస్ ఫీచర్‌ని ఉపయోగించి ఒకేసారి నాలుగు డివైజ్‌లలో, ఒక ఫోన్‌కి కనెక్ట్ చేయొచ్చు. ఒకే వాట్సాప్‌ను మూడు ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్ టాప్‌లలో ఉపయోగించొచ్చు. అయితే, ఫోన్ 14 రోజుల పాటు పనిచేయకుండా ఉండే మాత్రం, ఆ డివైజ్‌లలో డిస్‌కనెక్ట్ అవుతుంది.
ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి..
1. మొబైల్‌లో వాట్సాప్ క్లిక్ చేసి, పైన మూలన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి.
2. అక్కడ కనిపించిన లింక్డ్ డివైజెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. iOS వినియోగదారులు సెట్టింగ్స్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్‌ను ఎంచుకోవచ్చు. లింక్డ్ డివైజ్‌ను క్లిక్ చేసి సెలక్ట్ చేసుకోవాలి.
3. డెస్క్‌టాప్ PC లేదా ల్యాప్‌టాప్‌లో web.whatsapp.com లేదా WhatsApp ని తెరవాలి.
4. స్క్రీన్‌పై కనిపించే QR కోడ్‌ను సెల్‌ఫోన్‌తో స్కాన్ చేయాలి. ఇప్పుడు లింక్ చేస్తోంది.
5. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉన్నా , మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా దీన్ని ఉపయోగించవచ్చు.
6. అన్‌లింక్ చేయడానికి వినియోగదారులు వారి WhatsAppని ఓపెన్ చేసి మూడు చుక్కల మెనుపై క్లిక్ చేయాలి. లింక్డ్ డివైజ్‌లను సెలక్ట్ చేయాలి. అన్‌లింక్ చేయాలనుకుంటున్న డివైజ్‌పై క్లిక్ చేసి, లాగ్ అవుట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..