Whatsapp: ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. అయితే తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజ్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో మీరు పంపిన మెసేజ్‌లు వారం రోజుల తర్వాత అటోమెటిక్‌గా గతంలో డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్‌టాప్‌లో వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంట యాప్‌లతో పోటీ పడుతున్న నేపథ్యంలో వేగంగా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకువస్తోంది.
దీంతో పాటు వాట్సాప్ కొత్తగా మళ్లీ తన సేవా నియమాలకు సంబంధించిన అలెర్ట్‌ను యాప్‌లో అందించనుంది. గతంలో వీటిని యాక్సెప్ట్ చయని ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ అలెర్ట్ వస్తోందని తెలుస్తోంది.
భవిష్యత్తులో వాట్సాప్ వినియోగదారులు తమ చాట్లను ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల మధ్య కూడా మార్చుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. మల్టీ డివైస్ సపోర్ట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా కొత్త ఫోన్ కొన్నప్పుడు వినియోగదారులు చాట్ బ్యాకప్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.