Whatsapp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.? దాని ఉపయోగం ఏంటంటే..

|

Feb 03, 2023 | 3:51 PM

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూ వస్తోంది వాట్సాప్‌. ప్రత్యర్థి కంపెనీల పోటీని తట్టుకుంటూ ముందువరుసలో దూసుకుపోతోంది. దీనికి కారణం...

Whatsapp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.? దాని ఉపయోగం ఏంటంటే..
Whatsapp
Follow us on

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూ వస్తోంది వాట్సాప్‌. ప్రత్యర్థి కంపెనీల పోటీని తట్టుకుంటూ ముందువరుసలో దూసుకుపోతోంది. దీనికి కారణం వాట్సాప్‌ తీసుకొస్తున్న ఫీచర్లే. ఈ క్రమంలోనే తాజాగా సైలెంట్‌గా వాట్సాప్‌ మరో ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఏదైనా వీడియో రికార్డ్‌ చేసి పంపుకోవాలనుకుంటే కెమెరా బటన్‌ను నొక్కి పట్టుకోవాల్సి ఉండేది. ఒకవేళ బటన్‌పై నుంచి వేలు తీసేస్తే రికార్డింగ్‌ ఆగిపోతుంది. ఇలా వీడియో రికార్డు చేస్తున్నంత సేపు యూజర్లు వేలు కెమెరా బటన్‌పై ఉంచాల్సి వచ్చేది. అయితే తాజాగా వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టింది. వీడియో మోడ్‌ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది.

కెమెరా సెక్షన్‌లో వీడియో మోడ్‌ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లను కెమెరా ఓపెన్‌ చేయగానే కింద వీడియో, ఫొటో అనే రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. అందులో వీడియోను సెలక్ట్ చేసుకొని రికార్డింగ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సినంత సేపు వీడియో రికార్డింగ్‌ అవుతుంది. ఈ ఫీచర్‌ మీకూ యాడ్‌ అయ్యిందేమో చెక్‌ చేసుకోండి. ఒకవేళ అయ్యుండకపోతే ఓసారి వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే సరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..