AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: మీ వాట్సాప్‌ చాట్‌ ఇతరులకు కనిపించకూడదా.? మీకోసమే ఈ కొత్త ఫీచర్‌.

యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వస్తోంది మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న..

WhatsApp: మీ వాట్సాప్‌ చాట్‌ ఇతరులకు కనిపించకూడదా.? మీకోసమే ఈ కొత్త ఫీచర్‌.
Whatsapp New Feature
Narender Vaitla
|

Updated on: May 16, 2023 | 7:44 AM

Share

యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వస్తోంది మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఏంటి.? అసలు దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

‘లాక్‌చాట్’ పేరుతో వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. సోమవారం రాత్రి నుంచి యూజర్లకు ఈ అప్‌డేట్‌ను అందించింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్‌ ఎవరికీ కనిపించకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్‌వర్డ్‌ లేదా ఫింబర్‌ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

అంతేకాదు మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు. అలాగే సదరు కాంటాక్ట్ నుంచి మెసేజ్‌ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్‌లో ఆ మెసేజ్‌ కనిపించదు. ఇలా గోప్యతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి మెటా ఓ వీడియోను సైతం విడదుల చేసింది. ఇందులో ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి.? దానివల్ల కలిగే లాభాలు ఏంటి.? అన్న విషయాలను ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
40 ఏళ్ల తర్వాత ఆరోగ్య బ్రహ్మాస్త్రాలు.. వృద్ధాప్యాన్ని ఓడించే
40 ఏళ్ల తర్వాత ఆరోగ్య బ్రహ్మాస్త్రాలు.. వృద్ధాప్యాన్ని ఓడించే
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కేంద్రం అలర్ట్.. ఈ పని చేయాల్సిందే..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కేంద్రం అలర్ట్.. ఈ పని చేయాల్సిందే..
దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..?
దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..?
ఓ మహిళ.. మరో 10మంది.. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు..
ఓ మహిళ.. మరో 10మంది.. ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు..
'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోపై చిన్మయి ఆగ్రహం
'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోపై చిన్మయి ఆగ్రహం
ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
‘నో అవుట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్‌తో నగర యువత కొత్త ట్రెండ్
‘నో అవుట్‌సైడ్ ఫుడ్’ చాలెంజ్‌తో నగర యువత కొత్త ట్రెండ్
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.!
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.!
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?