Artificial Intelligence: మీ పాస్ వర్డ్ ఎంత భద్రం? నిమిషంలోపే హ్యాక్ చేస్తానంటున్న ఏఐ! సవాలుకు సిద్దమా?

|

Apr 10, 2023 | 4:15 PM

ఇంటర్ నెట్ వినియోగదారుల పాస్ వర్డ్ ను కృత్రిమ మేధ(ఏఐ) చాలా సులభంగా క్రాక్ చేయగలదని ఆ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సాధారణ పాస్ వర్డ్ లను కేవలం నిమిషం కన్నా తక్కువ సమయంలో ఈ ఏఐ ఛేదించగలుగుతుందట.

Artificial Intelligence: మీ పాస్ వర్డ్ ఎంత భద్రం? నిమిషంలోపే హ్యాక్ చేస్తానంటున్న ఏఐ! సవాలుకు సిద్దమా?
Artificial Intelligence
Follow us on

గత కొన్ని నెలలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా చాట్ జీపీటీ ఆవిర్భావంతో పాటు పలు రకాల ఏఐ టూల్స్ మెయిన్ స్ట్రీమ్ ఇంటర్ నెట్ యూజర్లకు అందుబాటులోకి రావడంతో వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ ప్రశ్నార్థకం అవుతోందని సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ అధ్యయనం ఈ ఆందోళనలను మరింత పెంచేస్తోంది. ఇంటర్ నెట్ వినియోగదారుల పాస్ వర్డ్ ను కృత్రిమ మేధ(ఏఐ) చాలా సులభంగా క్రాక్ చేయగలదని ఆ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సాధారణ పాస్ వర్డ్ లను కేవలం నిమిషం కన్నా తక్కువ సమయంలో ఈ ఏఐ ఛేదించగలుగుతుందంట. ఈ నేపథ్యంలో సైబర్ దాడులు పెరిగే అవకాశం అధికంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ పాస్ వర్డ్ లు ఎలా ఉండాలి? ఎంత పకడ్బందీగా ఉంటే ఏఐ దానిని ఛేదించలేదు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నిమిషం కన్నా తక్కువ సమయంలోనే..

హోమ్ సెక్యూరిటీ హీరోస్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో దాదాపు 51 శాతం సాధారణ పాస్ వర్డ్ లను కృత్రిమ మేధ కేవలం నిమిషం కన్నా తక్కువ సమయంలో ఛేదింగలుతుందని తేలింది. అలాగే ఇంకా 65 శాతం కాస్త కఠినమైన పాస్ వర్డ్ లను కూడా కేవలం గంట వ్యవధిలో ఛేదిస్తుంది. కొన్ని మరింత కఠినమైన 81 శాతం పాస్ వర్డ్ లను నెల లోపే ఛేదిస్తుందని ఆ అధ్యయనంలో స్పష్టమైంది.

ఎలా ఛేదించగలుతుంది.. కృత్రిమ మేధ పాస్ వర్డ్ లను క్రాక్ చేయడానికి పాస్ గ్యాన్(passGAN) అనే టూల్ ని వినియోగిస్తోంది. దీని ద్వారా 15,680,000 పాస్ వర్డ్ లను ఛేదించి, ఫలితాలను పబ్లిష్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరి వేరే దారి లేదా..

ఎంత కఠినమైన పాస్ వర్డ్ లు పెట్టుకున్నా ఈ కృత్రిమ మేధ ఛేదిస్తోంది కదా.. మరి మన డేటా భద్రంగా ఉంచుకోవాలి అంటే మన పాస్ వర్డ్ లు ఎలా పెట్టుకోవాలి? అనే ప్రశ్నకు అదే అధ్యయనంలో సమాధానం ఇచ్చారు. 18 అక్షరాలతో కూడిన పాస్ వర్డ్ ను ఛేదించడం ఏఐ కి కష్టమవుతుందని ఆ అధ్యయనం చెప్పింది. ఇటువంటి పాస్ వర్డ్ ను క్రాక్ చేయాలంటే ఏఐ కి దాదాపు 10 నెలల సమయం పడుతుందని పేర్కొంది. అదే 18 అక్షరాలలో సింబల్స్, నంబర్లు, కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, వంటి పాటితో సెట్ చేస్తే ఏఐ కి దాదాపు క్విన్ టిలియన్ ఇయర్స్( 10 తర్వాత 17 సున్నాలు వస్తాయి) అంత సమయం పడుతుందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.

ఇలా చేయాలి..

మీ పాస్ వర్డ్ కేవలం అక్షరాలలో ఉంటే చాలా సులభంగా క్రాక్ చేయవచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అదే కనీసం పది అక్షరాలతో, అది కూడా కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, వంటి వాటితో ఉండాలని అధ్యయనం చేసిన సంస్థ ప్రకటించింది. మీ పాస్ వర్డ్ కనీసం 15 అక్షరాలతో ఉండాలి.. వాటిలో కనీసం రెండు అక్షరాలు అప్పర్, లోవర్ కేస్ ఉండాలి. మిగిలిన వాటిల్లో నంబర్లు, సింబల్స్ ఉండాలి. అలాగే సులువుగా క్రాక్ చేయగల ప్యాట్రన్స్ ను వినియోగించకండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..