Vivo Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గించిన వివో.. కొత్త రేట్లను తెలుసుకోండి

Vivo Smartphones: వివో తన రెండు స్మార్ట్‌ఫోన్‌లైన Vivo Y21, Vivo Y21E ధరలను తగ్గించింది. గతేడాది ఆగస్టులో Vivo Y21 ని ప్రవేశపెట్టగా, ఈ ఏడాది Vivo Y21e ని ప్రవేశపెట్టింది. ..

Vivo Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గించిన వివో.. కొత్త రేట్లను తెలుసుకోండి
Follow us

|

Updated on: May 03, 2022 | 9:00 PM

Vivo Smartphones: వివో తన రెండు స్మార్ట్‌ఫోన్‌లైన Vivo Y21, Vivo Y21E ధరలను తగ్గించింది. గతేడాది ఆగస్టులో Vivo Y21 ని ప్రవేశపెట్టగా, ఈ ఏడాది Vivo Y21e ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ముంబైకి చెందిన మహేష్ టెలికాం Vivo Y21, Vivo Y21e ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ రెండూ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అవి మరింత సరసమైనవిగా మారతాయి. ఈ రెండు ఫోన్ల ధర దాదాపు రూ.500 తగ్గింది. Vivo Y21 రెండు మోడళ్లలో వస్తుంది. వాటిలో ఒకటి 4 GB RAM + 64 GB స్టోరేజ్ కాగా, మరొకటి 4 GB RAM + 128 GB స్టోరేజ్ ఉంది. లాంచ్ సమయంలో వాటి ధర వరుసగా రూ. 13990, రూ. 15490 ఉండగా, ఇప్పుడు ప్రారంభ వేరియంట్ ధర రూ.13490. ఇక అదే సమయంలో, Vivo Y21eతో 3 GB RAM, 64 GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. ఇది లాంచ్ సమయంలో రూ. 12990గా ఉండగా, ఇప్పుడు ఈ ధర రూ.12490 అయ్యింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Vivo Y21 స్పెసిఫికేషన్‌లు: Vivo Y21 స్పెసిఫికేషన్.. 6.51 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ కెమెరా, వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో ప్రాథమిక కెమెరా 13 మెగాపిక్సెల్‌లు, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్‌లు. ఈ ఫోన్‌లో Helio P35 చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఇది 4 GB RAM, 128 GB ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో ఉండగా, దీనిలో 18W ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.

Vivo Y21e స్పెసిఫికేషన్‌లు: Vivo Y21e స్పెసిఫికేషన్.. ఇది స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో వస్తుంది. 3 GB RAM, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉంటుంది. దీని స్పెసిఫికేషన్లు Vivo Y21ని పోలి ఉంటాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లను మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

Strong Password: మీ అకౌంట్‌కు హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు ఉండాలంటే ఇవి వాడండి..!

Phone Charging: ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పులు చేస్తే అంతే సంగతి.. ఒక్కోసారి ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త..