- Telugu News Photo Gallery Technology photos Samsung launches new smart phone Samsung Galaxy m53 5g price and features
Samsung Galaxy m53 5g: సామ్‌సంగ్ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. 108 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో..
Samsung Galaxy m53 5g: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ తాజాగా మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్53 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు..
Updated on: May 04, 2022 | 8:55 AM

సామ్‌సంగ్ ఎమ్ సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్53 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఇవే..

మీడియాటెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో సూపర్ అమోఎల్‌ఈడీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ అందించారు. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అదనంగా అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో వాయిస్ ఫోకస్ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. దీని సహాయంతో పరిసరాల్లో శబ్దాలు ఉన్నా, కాల్స్ స్పష్టంగా వినిపిస్తాయి.

ఇక ధర విషయానికొస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,499, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499గా ఉంది. అంతేకాకుండా పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై డిస్కౌంట్ అందిస్తున్నారు.




