AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strong Password: మీ అకౌంట్‌కు హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు ఉండాలంటే ఇవి వాడండి..!

Strong Password: ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. డిజిటల్‌ టెక్నాలజీ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక సంస్థలు, ఆర్థికేతర సంస్థలు తమ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా ..

Strong Password: మీ అకౌంట్‌కు హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు ఉండాలంటే ఇవి వాడండి..!
Subhash Goud
|

Updated on: May 03, 2022 | 8:39 PM

Share

Strong Password: ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. డిజిటల్‌ టెక్నాలజీ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక సంస్థలు, ఆర్థికేతర సంస్థలు తమ సేవలను ఆన్‌లైన్‌ (Online) ద్వారా అందిస్తున్నాయి. చాలా వరకు వ్యక్తిగత సమాచారం డిజిటల్‌గానే భద్రపర్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి స‌మాచారాన్ని తస్కరించేందుకు కొంత మంది హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఇ-మెయిల్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలకు (Bank Accounts) సంబంధించిన పూర్తి డేటాను దొంగిలించేందుకు కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇందుకు పోలీసులకు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇ-మెయిల్స్‌, ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లకు సంబంధించి పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు గుర్తు పట్టని విధంగా పాస్‌వర్డులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి మోసాల‌ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. పాస్‌వ‌ర్డ్‌ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హ్యాక‌ర్లు తెలుసుకోలేని విధంగా పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

భద్రత ఉండే పాస్‌వర్డ్‌లు..

☛ పాస్‌వ‌ర్డ్‌లో క‌నీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకోవాలి. అంత‌కంటే ఎన్ని ఎక్కువ ఉంటే పాస్‌వర్డ్‌ అంత ప‌టిష్ఠంగా ఉంటుంది.

☛ పాస్‌వర్డ్‌లో అప్పర్ కేస్ అక్షరాలు, లోయ‌ర్ కేస్ అక్షరాలు, అంకెలతో పాటు గుర్తుల‌ను (సింబ‌ల్స్‌) ఉప‌యోగించాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. svK@E7uG లాంటివి.

☛ సాధార‌ణ డిక్షరీ ప‌దాల‌ను ఉప‌యోగించకూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు itislocked లేదా thisismypassword లాంటి కామ‌న్ ప‌దాల‌ను ఉప‌యోగించ‌కూడదు. స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం ఎంతో మేలు.

☛ చాలా మంది పాస్‌వర్డ్‌ సులభంగా గుర్తించుకునేందుకు కీబోర్డులో వరుసగా అక్షరాల‌ను ‘qwerty’ లేదా ‘asdfg’ లేదా ‘zxcvb’ వంటి వాటిని ఉప‌యోగించ‌డం మంచిది కాదు.

☛ ఎప్పుడైన సరే పాస్‌వర్డ్‌లు పెట్టుకునేందుకు వ‌రుస ఆంగ్ల పదాలు abcdefg, zyxwv, గానీ వ‌రుస అంకెలు 12345678 గానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.

☛ సుల‌భంగా ఊహించ‌గ‌ల ప‌దాలైన మీ పేరు, ఇంటి స‌భ్యుల పేర్లు, నాయ‌కుల పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ గ్రామం పేరు, ఇష్టమైన సెలబ్రేటీల పేర్లు, డోర్ బెల్‌, డోర్‌ 123 లాంటి కామ‌న్ ప‌దాలు పెట్టుకోకూడదు.

☛ పాస్‌వ‌ర్డ్ కాస్త పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి. మీ పేరు, లేదా కుటుంబ స‌భ్యుల పేర్లకు పుట్టిన తేదీ, సంవ‌త్సరం జోడించి పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు చాలామంది. ఉదాహ‌ర‌ణ‌కు Kiran@1976. ఈ విధంగా పెడితే మోస‌గాళ్లు త్వరగా గుర్తించే అవకాశం ఉంది. అందుకే పాస్‌వ‌ర్డ్‌లో ఇలాంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది. ఎవ్వరు కూడా ఊహించని విధమైన పదాలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవడం బెటర్‌ అని సూచిస్తు్న్నారు టెక్‌ నిపుణులు.

ఇలాంటి స్ట్రాంగ్‌ పాస్‌వర్డులు పెట్టుకోవడం వల్ల మీ బ్యాంకు అకౌంట్‌ గానీ, నెట్‌ బ్యాంకింగ్‌, ఫోన్‌పే, పేటీఎం, ఫేస్‌బుక్‌లతో ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లు, బ్యాంకులకు, ఇతర వాటికి సంబంధించి అకౌంట్ల పాస్‌వర్డులు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతమున్న టెక్నాలజీ కారణంగా హ్యాకర్లు పాస్‌వర్డులను సులభంగా గుర్తిస్తున్నారు. దీంతో వ్యక్తిగత వివరాలతో పాటు ఖాతాలో ఉన్న డబ్బులు సైతం మాయమయ్యే అవకాశం ఉంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే గూగుల్‌ కూడా చాలా మంది ఎక్కువగా పెట్టుకునే సులభమైన పాస్‌వర్డ్‌లను సైతం విడుదల చేస్తూ అప్రమత్తం చేస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Phone Charging: ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పులు చేస్తే అంతే సంగతి.. ఒక్కోసారి ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త..

Tata Motors: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 500 కి.మీ మైలేజీ

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్