
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. భారతదేశం జనాభా నేపథ్యంలో ఇక్కడ కూడా స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది. ముఖ్యంగా పిల్లల ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఇంటికి చేరింది. పెరిగిన డిమాండ్‌కు అనుగణంగా అన్ని కంపెనీలు సరికొత్త అప్‌డేట్స్ నయా స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన వివో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. వివో వై 200 5జీ పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ ప్రముఖ బాలివుడ్ నటి సారా అలీఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. వివో వై 200 5 జీ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 23, 2023న మధ్యాహ్నం రిలీజ్ చేస్తుంది. ప్రారంభ టీజర్‌లో ఫోన్ విడుదల తేదీతో పాటు బాలివుడ్ నటి సారా అలీఖాన్‌ను కూడా టీజర్ ఫొటోలో ఉంది. అయితే ఈ ఫోన్ గురించి వివరాలు అధికారికంగా అందుబాటులో లేకపోయిన కొన్ని లీకైన వివరాలు మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. కాబట్టి వివో వై 200 ఫోన్ మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
అయితే ఈ ఫోన్ ధర రూ.24000 వరకూ ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే అధికారికంగా ధర ఎంత ఉంటుందో? తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..