AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లోకి వివో V2607, Y31T.. పూర్తి వివరాలివే

Vivo V2607 and Y31t.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి త్వరలో మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ సైట్‌లో కనిపించిన ఈ కొత్త ఫోన్ మిడ్‌రేంజ్ ఫీచర్లతో వినియోగదారులను అలరించేందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం.

పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లోకి వివో V2607, Y31T.. పూర్తి వివరాలివే
Vivo V2607 And Y31t
Nikhil
|

Updated on: Aug 24, 2026 | 6:40 AM

Share

టెక్ మార్కెట్లో వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ల ద్వారా హవా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. V2607 మోడల్‌తో పాటు Y31t ఫోన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త డివైజ్‌ల ప్రాసెసర్, ఫీచర్లు మరియు మార్కెట్ పరిస్థితుల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

వివో V2607 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి త్వరలో మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల Vivo V2607 అనే మోడల్ పేరుతో ఒక ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ సైట్‌లో కనిపించింది. ప్రముఖ లీకర్ అందించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ మిడ్‌రేంజ్ ఫీచర్లతో వినియోగదారులను అలరించేందుకు రాబోతోందని తెలుస్తోంది.

ఈ కొత్త వివో ఫోన్‌లో 8GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండనున్నాయి. ఇందులో వాడిన MT6881 చిప్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 కావచ్చని భావిస్తున్నారు. 2.6 GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పాటు ఆర్మ్ మాలి-G625 iGPU, మీడియాటెక్ NPU 850 కూడా ఉంటాయి. దీంతో గేమింగ్‌తో పాటు ఏఐ (AI) ఫీచర్లలోనూ ఈ ఫోన్ మంచి పనితీరు కనబరిచే అవకాశముంది. మరోవైపు వివో నుంచి Y31t అనే మరో ఫోన్ కూడా భారత మార్కెట్లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వివో Y31t ఫీచర్లు

ఈ ఫోన్ 6.75 అంగుళాల ఎల్‌సిడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో రానుందని సమాచారం. ఇక కెమెరా విషయానికొస్తే వెనుక వైపు 50MP ప్రాథమిక కెమెరాతో పాటు 2MP సెన్సార్, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఈ వివో Y31t ప్రారంభ వేరియంట్ (4GB/128GB) ధర దాదాపు రూ.25,000 వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ ప్రాసెసర్‌కు ఈ ధర కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. సాధారణంగా స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్ రూ.20,000 లోపు ఉండే బడ్జెట్ ఫోన్లకే సరిపోతుంది. ఇటీవల విడిభాగాల వ్యయం, ర్యామ్ ధరలు భారీగా పెరగడంతో, తయారీ కంపెనీలు బడ్జెట్ ప్రాసెసర్లు ఉన్న ఫోన్లను కూడా రూ.25,000 దాటించి విక్రయించాల్సి వస్తోంది. మొత్తానికి వివో నుంచి రానున్న ఈ కొత్త ఫోన్లు టెక్ మార్కెట్లో ఎలాంటి స్పందనను రాబడతాయో వేచి చూడాలి.

Follow Us