
యూజర్ల వాడకానికి తగినట్లు అప్‌గ్రేడ్ చేసి కంపెనీలు మార్కెట్‌లోకి తమ స్మార్ట్ ఫోన్‌లను రిలీజ్ చేస్తూ ఉంటాయి. టెక్నాలజీ మారుతున్న కొద్ది ఈ ఫోన్‌లలో కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేస్తూ వస్తున్నాయ్.. అలా వచ్చిన ఫీచర్లలో ఐపీ రేటింగ్స్ ఒకటి. ఇటీవల లాంచ్ అవుతున్న ప్రతి మోడల్ ఫోన్‌లలోనూ ఈ ఐపీ రేటింగ్స్ ప్రస్తావన ఉంటోంది. ఈ ఐపీ రేటింగ్ అంటే ఏమిటంటే.. Ingress Protection Rating ఇది మన ఫోన్‌ను నీరు, ధూళి నుండి రక్షిస్తుంది. వీటిలో ప్రధానం రెండు వేరియంట్స్ ఉన్నాయి. అవే IP67, IP68 ఈ వేరియంట్ల ఆధారంగా ఫోన్ నాణత్యనను నిర్ణయిస్తారు. ఇవే ఫోన్‌ను నీటి అడుగున ఎంతసేపు ఉపయోగించగలమో కూడా తెలియజేస్తాయి.
IP67- ఈ రేటింగ్ ఉన్న ఫోన్లు 1 మీటర్ లోతు వరకు నీటిలో మునిగిపోయినా 30 నిమిషాల పాటు ఇవి నీటిలో సర్వైవ్ కాగలవు. IP68 ఈ రేటింగ్ ఉన్న ఫోన్లు 1.5 మీటర్ల లోతు వరకు నీటిలోనూ 30 నిమిషాల పాటు మనుగడ సాగించగలవు. ప్రస్తుం అందుబాటులోకి వచ్చే కొన్ని ఫోన్ తయారీదారులు తమ ఫోన్లు 2 మీటర్ల లోతు వరకు నీటిలో మునిగిపోయినా మనుగడ సాగిస్తాయని పేర్కొన్నారు.
IP రేటింగ్‌ల గురించి గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నీటి పరీక్షలన్నీ మంచినీటిలోనే జరుగుతాయి. అయితే, కొంతమంది నిపుణులు సముద్రపు నీరు, క్లోరినేటెడ్ నీరు, వేడి నీరు ఫోన్ నీటి నిరోధకతకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ఉప్పు నీరు, క్లోరిన్ ఫోన్ సీల్స్‌ను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. ఫోన్ వీటిలో పడినప్పుడు ఫోన్ లోహ భాగాలపై తుప్పు పట్టడానికి కారణమవుతాయని అంటున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.