AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ.. TVS నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు తెలుసుకుంటే షాకవుతారు

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తన ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు TVS Motor Company సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా EICMA 2026 వేదికగా తన కొత్త TVS M1-S ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రొడక్షన్‌ వెర్షన్‌ను పరిచయం చేసింది. మ్యాక్సీ స్కూటర్‌ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ మోడల్‌ ప్రస్తుతం వాహన ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్‌, గంటకు 105 కిలోమీటర్ల గరిష్ఠ వేగం దీని ప్రధాన ప్రత్యేకతలు. ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు, డ్యూయల్‌ ఛానల్‌ ABS వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ.. TVS నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు తెలుసుకుంటే షాకవుతారు
Tvs M1 S Electric Scooter
Nikhil
|

Updated on: Nov 14, 2026 | 6:20 AM

Share

TVS M1-Sను రోజువారీ ప్రయాణాలతో పాటు వేగవంతమైన రైడింగ్‌ అనుభవాన్ని కోరుకునే వారి కోసం రూపొందించారు. ఇందులో 4.2kWh లిథియం అయాన్‌ NMC బ్యాటరీని అందించారు. యూరోపియన్‌ WMTC టెస్టింగ్‌ ప్రమాణాల ప్రకారం ఈ స్కూటర్‌ 120 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే భారత్‌లో ఈ స్కూటర్‌ ఎప్పుడు విడుదలవుతుంది? ధర ఎంత ఉంటుంది? అనే వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.

టాప్ స్పీడ్‌

TVS M1-Sలో 4.2kWh బ్యాటరీని ఫ్లోర్‌బోర్డ్‌ భాగంలో అమర్చారు. దీనివల్ల స్కూటర్‌ గురుత్వ కేంద్రం తక్కువగా ఉండి, బరువు సమతుల్యత మెరుగుపడుతుంది. ఇందులో చాసిస్‌కు అనుసంధానించిన Permanent Magnet Synchronous మోటార్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 12.5kW పవర్‌ లేదా సుమారు 17PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్‌ గరిష్ఠ వేగం గంటకు 105 కిలోమీటర్లు. అయితే వాస్తవ వినియోగంలో రేంజ్‌ అనేది రోడ్డు పరిస్థితులు, వేగం, రైడింగ్‌ విధానంపై ఆధారపడి మారుతుంది.

ఛార్జింగ్‌ విషయానికి వస్తే ఇందులో 1.8kW సామర్థ్యం కలిగిన ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌ ఉంది. కంపెనీ సమాచారం ప్రకారం, బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి సుమారు గంటా 15 నిమిషాలు పడుతుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్కులు, వెనుక రెండు షాక్‌ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు వైపులా 14 ఇంచుల వీల్స్‌ అందించారు. ముందు 110/70, వెనుక 120/70 టైర్లు ఉన్నాయి. రెండు చక్రాలకు 230mm డిస్క్‌ బ్రేకులతో పాటు డ్యూయల్‌ ఛానల్‌ ABS సదుపాయం కల్పించారు.

స్మార్ట్‌ ఫీచర్లు అదుర్స్‌

డిజైన్‌ విషయానికి వస్తే TVS M1-S మ్యాక్సీ స్కూటర్‌ తరహాలో కనిపిస్తుంది. పెద్ద ఫ్రంట్‌ అప్రాన్‌, విండ్‌షీల్డ్‌, ఆకర్షణీయమైన లైటింగ్‌, లేయర్డ్‌ బాడీ ప్యానెల్స్‌ ఉన్నాయి. తెలుపు, నలుపు రంగుల డ్యూయల్‌ టోన్‌ ఫినిషింగ్‌తో పాటు ఆరెంజ్‌ వీల్స్‌ స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. సింగిల్‌ పీస్‌ స్టెప్‌డ్‌ సీటు, ర్యాక్‌, టాప్‌ బాక్స్‌ కూడా ప్రదర్శించిన మోడల్‌లో కనిపిస్తున్నాయి. అయితే ర్యాక్‌, టాప్‌ బాక్స్‌ ఆప్షనల్‌ యాక్సెసరీలుగా లభించే అవకాశం ఉంది.

ఈ స్కూటర్‌లో సీటు కింద 26 లీటర్ల స్టోరేజ్‌ స్పేస్‌, ముందు గ్లోవ్‌బాక్స్‌, అదనపు ఓపెన్‌ స్టోరేజ్‌ ఉన్నాయి. సీటు ఎత్తు 800mm, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 170mm, కెర్బ్‌ వెయిట్‌ 150 కిలోలుగా ఉంది. క్రూయిజ్‌ కంట్రోల్‌, TPMS, USB Type-A ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 7 ఇంచుల TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌కు Bluetooth, Wi-Fi, LTE కనెక్టివిటీ సపోర్ట్‌ లభిస్తుంది. Android, iOS ఫోన్లను కనెక్ట్‌ చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా సీట్‌ అన్‌లాకింగ్‌, కీ-ఫాబ్‌ ఇగ్నిషన్‌, Find My Bike, OTA సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ వంటి సదుపాయాలు పొందవచ్చు. ప్రస్తుతం TVS అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తరణపై దృష్టి పెట్టింది. భారత్‌లో M1-S విడుదల తేదీ, ధర, అందుబాటు వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో