AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరే ఫీచర్లతో Razer Hammerhead V3 Chroma వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌.. టైప్​ C సహా ఎన్నో స్పెషాలిటీస్​

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా గేమర్స్, ఆడియో ప్రియులు తక్కువ లేటెన్సీతో నిరంతరాయంగా ఆడియో వినాలనుకున్నప్పుడు వైర్డ్ ఆప్షన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లో ఛార్జింగ్ అవసరం, కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో కొందరు ఇప్పటికీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గేమింగ్ యాక్సెసరీల సంస్థ Razer కొత్తగా Hammerhead V3 Chroma వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌ను పరిచయం చేసింది.

అదిరే ఫీచర్లతో Razer Hammerhead V3 Chroma వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌.. టైప్​ C సహా ఎన్నో స్పెషాలిటీస్​
Razer Hammerhead V3 Chroma Wired Earphones
Nikhil
|

Updated on: Nov 14, 2026 | 6:10 AM

Share

స్టైలిష్ డిజైన్‌తో పాటు Razer Chroma RGB లైటింగ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC), మెరుగైన ఆడియో అనుభూతిని అందించే ఫీచర్లతో Hammerhead V3 Chroma ఇయర్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. USB Type-C కనెక్టివిటీ ఉండటంతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లకు అనుసంధానం చేసుకోవచ్చు. గేమింగ్ సమయంలో ఆడియో స్పష్టత కోరుకునేవారితో పాటు మ్యూజిక్ వినే వారికి కూడా ఇవి ఉపయోగపడేలా రూపొందించారు. ఈ కొత్త ఇయర్‌ఫోన్స్ ఫీచర్లు, అంచనా ధర వివరాలు తెలుసుకుందాం.

ఆకట్టుకునే డిజైన్

Razer ఉత్పత్తుల్లో ప్రత్యేకంగా కనిపించే Chroma RGB లైటింగ్‌ను Hammerhead V3 Chromaలోనూ అందించారు. యూజర్లు తమ అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. చెవులకు సౌకర్యంగా ఉండేలా ఎర్గోనామిక్ డిజైన్‌ను రూపొందించారు. ఎక్కువసేపు ఉపయోగించినా ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ డిజైన్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వివరాలు సూచిస్తున్నాయి.

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో అరుదుగా కనిపించే Active Noise Cancellation (ANC) ఫీచర్‌ను ఇందులో అందించడం మరో ప్రత్యేకత. చుట్టుపక్కల ఉండే అనవసర శబ్దాలను తగ్గించి గేమింగ్, మ్యూజిక్ వినే సమయంలో మెరుగైన అనుభూతిని అందిస్తుంది. కస్టమ్-ట్యూన్డ్ డ్రైవర్లు బలమైన బాస్‌తో పాటు స్పష్టమైన వాయిస్‌ను అందిస్తాయి. ముఖ్యంగా FPS గేమ్స్ ఆడేటప్పుడు ప్రత్యర్థుల అడుగుల శబ్దాలను గుర్తించడానికి ఈ ఆడియో స్పష్టత ఉపయోగపడుతుంది.

USB Type-C కనెక్టివిటీ

ఈ ఇయర్‌ఫోన్స్‌కు IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. దీంతో చెమట, చిన్నపాటి నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు లేదా బయట జాగింగ్ చేసే సమయంలో ఇవి ఉపయోగపడతాయి. అయితే నీటిలో పూర్తిగా ముంచే విధంగా వీటిని ఉపయోగించకూడదు.

కనెక్టివిటీ కోసం USB Type-C పోర్ట్‌ను అందించారు. అనుకూలమైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌లైన్ మైక్రోఫోన్ ఉండటంతో కాల్స్ మాట్లాడటం కూడా వీలవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ ఇయర్‌ఫోన్స్ ధర సుమారు రూ.5,800 నుంచి రూ.6,000 మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. త్వరలో అధికారికంగా మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో విడుదల తేదీ, ఖచ్చితమైన ధరపై స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us
Razer Hammerhead V3 Chroma స్పెషాలిటీస్ తెలుసా
Razer Hammerhead V3 Chroma స్పెషాలిటీస్ తెలుసా
YOROTO Retro బ్లూటూత్​ స్పీకర్​ స్పెషాలిటీస్​
YOROTO Retro బ్లూటూత్​ స్పీకర్​ స్పెషాలిటీస్​
నీళ్లు తోడకుండానే బావిని ఖాళీ చేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
నీళ్లు తోడకుండానే బావిని ఖాళీ చేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
శనివారం ఈ 5 పనులు చేస్తే ఆర్థిక కష్టాలు దూరం.. శనిదేవుడి అనుగ్రహం
శనివారం ఈ 5 పనులు చేస్తే ఆర్థిక కష్టాలు దూరం.. శనిదేవుడి అనుగ్రహం
నవంబర్ 14 రాశిఫలాలు: శనివారం అదృష్టం పట్టే రాశులివే..?
నవంబర్ 14 రాశిఫలాలు: శనివారం అదృష్టం పట్టే రాశులివే..?
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే..
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే..
అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి..
అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి..
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో