నవంబర్ 14 రాశిఫలాలు: శనివారం అదృష్టం పట్టే రాశులివే..? మీ రాశికి ఇలా..
Horoscope (November 14, 2026): శనివారంనాడు కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసిరానుంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి ఆదాయ వృద్ధి, సామాజిక గుర్తింపు లభించనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి శనివారంనాటి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (నవంబర్ 14, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచ నాల్ని మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మీ శక్తిసామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా మాటకు, చేతకు తిరుగుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఊరట కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు దొర్లే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వల్ల నష్టపోవడం జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అయితే, కొద్ది శ్రమతో పనులన్నిటినీ చక్క బెడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిరాటం కంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగా సామరస్యంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఆదాయ మార్గాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం అవసరం. కుటుంబ బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. మిత్రులకు సహాయం చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నా లన్నీ సఫలయవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభ సాటిగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పూర్తిగా పరిష్కారమవుతాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు, బాకీలు పూర్తిగా వసూలవుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి కష్టనష్టాలు తప్పకపోవచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. కుటుంబ జీవితం సరదాగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. గతంలో సాయం పొందినవారు ముఖం చాటేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఇష్టమైన ఆల యాల్ని సందర్శిస్తారు. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు కీలక విషయాలను మీతో చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలకు, లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధువుల తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల సహకారం లభిస్తుంది.



