AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉందా..? ఇకపై QR కోడ్ చూపిస్తేనే సరుకులు.. కేంద్రం బిగ్ డెసిషన్..!

2026 నాటికి ఉచిత రేషన్ పంపిణీలో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. రేషన్ కార్డు స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్ల విధానం కేంద్రం తీసుకురానుందని సమాచారం. ఆర్‌బిఐ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ ఆధారిత ఫుడ్ సబ్సిడీ పైలట్ ప్రాజెక్టును పరిశీలిస్తుంది. త్వరలో ఇది అమల్లోకి రానుందని సమాచారం.

Ration Card: రేషన్ కార్డు ఉందా..? ఇకపై QR కోడ్ చూపిస్తేనే సరుకులు.. కేంద్రం బిగ్ డెసిషన్..!
Ration Card
Venkatrao Lella
|

Updated on: Nov 13, 2026 | 10:33 PM

Share

ప్రస్తుతం దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుమారు 78.65 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోంది. పేదలకు నిత్యావసరాలు సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా సుమారు 5.51 లక్షల రేషన్ షాపులు పనిచేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2026-2027లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం  కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,27,429 కోట్లకు పైగా కేటాయించింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ పథకం ద్వారా 2029 వరకు రేషన్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంత పెద్ద వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం పెంచడానికి కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుది. ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) మెషిన్లు, వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్ వంటి డిజిటల్ విధానాలను తీసుకొచ్చింది. అయితే రేషన్ సరుకులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు డిజిటల్ వోచర్ సిస్టమ్ ప్రతిపాదనను కేంద్రం తీసుకురానుందని తెలుస్తోంది. జనవరి 2026లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడీఎస్ సిస్టమ్‌లో ఎన్‌పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించడానికి ఒక కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను ఇష్యూయర్ బ్యాంక్‌గా.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)ని సాంకేతిక భాగస్వామిగా సూచించారు.

ఈ-రూపీ అనేది ఒక డిజిటల్ వోచర్. ఇది నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే జారీ చేసే వోచర్. మీ కుటుంబానికి నెలవారీ 10 కిలోల బియ్యం కేటాయింపు ఉంటే.. దానికి సంబంధించిన డిజిటల్ వోచర్ జనరేట్ అవుతుంది. ఈ వోచర్‌లో 10 కేజీ రైస్ వోచర్ అని ఉంటుంది. కానీ డబ్బు విలువ ఉండదు. దీనిని మరొకరికి బదిలీ చేయడం లేదా నగదుగా మార్చుకోవడం సాధ్యం కాదు. నిర్దిష్ట ఆహార ధాన్యాల కోసం మాత్రమే దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. లబ్దిదారుల అర్హత వివరాలను ఎస్బీఐకి పంపుతారు. ఎస్బీఐ, ఎన్‌పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి లబ్ధిదారుడి కోసం ప్రత్యేక వోచర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వోచర్ ఆధార్‌తో లింక్ అయిన లబ్ధిదారుడి వివరాలతో అనుసంధానించబడి ఉంటుంది. వోచర్ జనరేట్ అయిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్‌కు ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మేరా రేషన్ యాప్ ద్వారా కూడా దీనిని యాక్సెస్ చేయవచ్చు. లబ్ధిదారులు తమ స్థానిక రేషన్ షాప్‌కు వెళ్లి ఫోన్‌లోని ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్‌ను డీలర్‌కు చూపుతారు. డీలర్ ఈపీఓఎస్ మెషిన్ ద్వారా వోచర్‌ను స్కాన్ చేస్తారు లేదా వోచర్ ఐడీని నమోదు చేస్తారు.

ఆధార్ అనుసంధానిత వివరాలు ఓటీపీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరించబడతాయి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హత ప్రకారం సరుకులను అందిస్తారు. రేషన్ పంపిణీ పూర్తయిన తర్వాత లావాదేవీ వివరాలు డిజిటల్ సిస్టమ్‌లో రికార్డ్ అవుతాయి. ఎస్బీఐ, బ్యాంకులు, సంబంధిత వ్యవస్థల మధ్య సెటిల్‌మెంట్ జరుగుతుంది. డీలర్ కమిషన్ వివరాలు కూడా నమోదు చేయబడతాయి. దీనిని ఏటీఎం నుండి నగదుగా మార్చుకోవడం సాధ్యం కాదు.  వోచర్‌ను వేరొకరికి బదిలీ చేయలేరు. లబ్ధిదారుడు మాత్రమే రీడీమ్ చేయాల్సి ఉంటుంది.

Follow Us
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు
యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు
ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!
ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!
 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  
 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  
అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..
అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..
ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?
ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్
హోమ్ లోన్ కట్టేందుకు పీఎఫ్ నగదు విత్ డ్రా చేస్తున్నారా..?
హోమ్ లోన్ కట్టేందుకు పీఎఫ్ నగదు విత్ డ్రా చేస్తున్నారా..?
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో