Whatsapp: ఆఫీస్‌లో వాట్సాప్‌ ప్రైవసీకి భంగం కలుగుతోందా.? ఈ సింపుల్‌ ట్రిక్‌తో గోప్యత మీ సొంతం.

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌...

Whatsapp: ఆఫీస్‌లో వాట్సాప్‌ ప్రైవసీకి భంగం కలుగుతోందా.? ఈ సింపుల్‌ ట్రిక్‌తో గోప్యత మీ సొంతం.
Whatsapp

Updated on: Mar 31, 2023 | 7:37 AM

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌. మార్కెట్లో ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్‌ వస్తున్నా పోటీని తట్టుకొని మరీ నిలవడానికి ఇదే కారణం. ఇదిలా ఉంటే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ఇన్నర్‌ ఫీచర్స్‌ ఉంటాయి. వీటితో కలిగే లాభాలు తెలిస్తే కూడా పరేషన్‌ అవ్వాల్సిందే. అలాంటి ఓ వండర్‌ ఫుల్ ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌ అంటే ప్రైవేసీకి పెట్టింది పేరనే విషయం తెలిసిందే. ఇందులో ఉంటే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు చేసే చాటింగ్ మూడో వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు. అయితే వాట్సాప్ ఎంత ప్రైవసీ ఫీచర్లను అందించినా.. వాట్సాప్‌ వెబ్‌ వెర్షన్‌లో మాత్రం గోప్యతకు కాస్త ఇబ్బంది ఉంటుంది. ఉదాహరణకు ఆఫీసుల్లో వాట్సాప్‌ ఉపయోగించే సమయంలో ఈ సమస్య ఎదురవుతుంది. డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసిన సమయంలో మనం చేసిన చాట్స్‌, కాంటాక్ట్స్‌ వివరాలు పక్కనున్న వారికి స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రైవసీ భంగం కలిగిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఓ సింపుల్‌ ట్రిక్‌ ద్వారా మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవచ్చు. ఇంతకీ ఈ ట్రిక్‌ ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా గూగుల్‌ క్రోమ్‌లో ‘WA web plus’ అని టైప్‌ చేసి సెర్చ్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* వెంటనే స్క్రీన్‌పై ‘WA web plus for whatsapp’ అనే ఓ ఎక్స్‌టెన్షన్‌ ఓపెన్‌ అవుతుంది.

* తర్వాత ‘యాడ్ టూ క్రోమ్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో మీ క్రోమ్‌లోకి వాట్సాప్‌ ఎక్స్‌టెన్షన్‌ యాప్‌ అవుతుంది.

* ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించుకునేందుకు ముందుగా.. వాట్సాప్‌ వెబ్‌ ఓపెన్‌ చేసి మీ అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వాలి.

* అనంతరం క్రోమ్‌లో పైన రైట్‌ సైడ్‌ కనిపించే ఎక్స్‌టెన్షన్‌ బటన్‌పై క్లిక్‌ చేయగానే.. ‘WA web plus for whatsapp’ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.

* దీంతో బ్లర్‌ రీసెంట్ మెసేజెస్‌, బ్లర్‌ కాంటాక్స్‌ నేమ్స్‌, బ్లర్‌ కాంటాక్ట్‌ ఫొటోస్‌తో పాటు ఎన్నో ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకొని మీ ప్రైవసీకి భద్రత పెంచుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..