కాంతి వేగం… రియల్ టైమ్ విజువల్ షో!

| Edited By:

Oct 10, 2019 | 1:06 PM

కాంతి కన్నా వేగంగా ప్రయాణించే వస్తువుగానీ, సమాచారంగానీ, కణంగానీ, మరేదీగానీ లేదు. ఈ విశాల విశ్వంలో కాంతి వేగమే పరాకాష్ట (limit), శూన్యంలో కాంతివేగం సెకనుకు సుమారు మూడు లక్షల కిలోమీటర్లు. ఇదే విశ్వంలో అత్యంత వేగం. శూన్యంలో వేగం ఇంతున్నా ఇతర పదార్థాల్లో కాంతి వేగం తక్కువ ఉంటుంది. సూర్యుడి నుంచీ భూమికి కిరణాలు ప్రసరించడానికి 8 నిమిషాలు పడుతుందని మనకు తెలుసు. ఎందుకంటే… సూర్యుడికీ భూమికీ మధ్య దూరం ఎక్కువ కాబట్టి. అదే చందమామకీ […]

కాంతి వేగం... రియల్ టైమ్ విజువల్ షో!
Follow us on

కాంతి కన్నా వేగంగా ప్రయాణించే వస్తువుగానీ, సమాచారంగానీ, కణంగానీ, మరేదీగానీ లేదు. ఈ విశాల విశ్వంలో కాంతి వేగమే పరాకాష్ట (limit), శూన్యంలో కాంతివేగం సెకనుకు సుమారు మూడు లక్షల కిలోమీటర్లు. ఇదే విశ్వంలో అత్యంత వేగం. శూన్యంలో వేగం ఇంతున్నా ఇతర పదార్థాల్లో కాంతి వేగం తక్కువ ఉంటుంది. సూర్యుడి నుంచీ భూమికి కిరణాలు ప్రసరించడానికి 8 నిమిషాలు పడుతుందని మనకు తెలుసు. ఎందుకంటే… సూర్యుడికీ భూమికీ మధ్య దూరం ఎక్కువ కాబట్టి. అదే చందమామకీ భూమికీ మధ్య కాంతి రెప్పపాటులో ప్రయాణించగలదు. ఎందుకంటే… రెండింటి మధ్యా దూరం 3,84,400 కిలోమీటర్లు కాబట్టి.

ఈ విశ్వంలో అన్నింటి కంటే వేగంగా వెళ్లేది కాంతే. అది అంత వేగంతో ఎలా వెళ్లగలుగుతోందో శాస్త్రవేత్తలకు అంతుబట్టట్లేదు. ఈ క్రమంలో… అసలు కాంతి వేగం ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రయత్నించారు డాక్టర్ జేమ్స్ ఓ డోనోగ్. జపాన్ స్పేస్ ఏజెన్సీ జక్సాలో ప్లానెటరీ సైంటిస్ట్ అయిన ఆయన… ప్రత్యేక లెక్కలు కట్టి… భూమి చుట్టూ కాంతి ఎంత వేగంతో వెళ్తుందో… అలాగే… భూమికీ సూర్యుడికీ మధ్య కాంతి వేగం ఎలా ఉంటుందో గ్రాఫిక్స్ యానిమేషన్ ద్వారా చూపించారు. చందమామ, మార్స్, భూమి మధ్య కాంతి వేగాన్ని కూడా విజువలైజ్ చేశారు. జేమ్స్ ఇదివరకు నాసాకి చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో కూడా పనిచేశారు. ఆయన రూపొందించిన ఈ వీడియోకి యూట్యూబర్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదో మంచి ప్రయత్నమనీ, విద్యార్థులకు కాంతి వేగంపై మంచి అవగాహన వస్తుందని అంటున్నారు.