SBI Online Banking Tips: వినియోగదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. ఇలా చేస్తే ఇక అంతే! పూర్తి వివరాలు..

ఎస్బీఐ తన వినియోగదారులకు ఓ మెసేజ్ మెయిల్ చేసింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన నియమాలు అందులో పేర్కొంది. పలు సూచనలు, సలహాలు పంపింది. వాటిని పాటించడం ద్వారా మీ అకౌంట్ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది.

SBI Online Banking Tips: వినియోగదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. ఇలా చేస్తే ఇక అంతే! పూర్తి వివరాలు..
Online Banking

Updated on: Jul 28, 2023 | 5:00 PM

బ్యాంకింగ్ రంగం స్వరూపం మారిపోయింది. డిజిటల్ బాటలో దూసుకుపోతోంది. వినియోగదారులు ఆన్ లైన్ లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సెక్యూరిటీ సక్రమంగా పాటించకపోతే సైబర్ దాడులకు లోనయ్యే అవకాశం ఉంది. నేరగాళ్లు కూడా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అకౌంట్ సెక్యూరిటీ చాలా అవసరం. అన్ని బ్యాంకులు ఇప్పుడు ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. అదే సమయంలో ఆయా బ్యాంకులు కొన్ని సేఫ్టీ టిప్స్, సూచనలు చేస్తున్నాయి. వాటిని వినియోగదారులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకుంటే మీ అకౌంట్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ అడ్వాన్స్ డ్ ఉంటుంది. ఎస్బీఐ తన వినియోగదారులకు ఓ నోటిస్ పంపించింది. దానిలో ఆన్ లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ చేసేటప్పుడు తీసుకోవాలని జాగ్రత్తలున్నాయి. ఈ మేరకు వినియోగదారుల ఈ మెయిల్స్ కి ఈ నోట్ పంపింది. ఆ సేఫ్టీ నియమాలు, నిబంధనలు, సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎస్బీఐ సూచనలు ఇవి..

ఎస్బీఐ తన వినియోగదారులకు ఓ మెసేజ్ మెయిల్ చేసింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన నియమాలు అందులో పేర్కొంది. పలు సూచనలు, సలహాలు పంపింది. వాటిని పాటించడం ద్వారా మీ అకౌంట్ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. అవేంటంటే..

ఇవి కూడా చదవండి
  • ఎస్బీఐ మీకు ఎటువంటి లింక్స్ పంపదు. ఎస్ఎంఎస్/ఈమెయిల్ అప్ డేట్/ అన్ బ్లాక్ పాన్/కేవైసీ/యోనో వంటి గురించి ఏ విధమైన లింక్స్ వచ్చినా క్లిక్ చేయొద్దు
  • అలాగే మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని మీకు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించొద్దు. ఎస్బీఐ బ్యాంకు నుంచి మీకు ఎటువంటి కాల్స్ ఈ విధంగా రావు. అలాగే ఫోన్లో పాస్ వర్డ్ లు, ఓటీపీలు అస్సలు చెప్పొద్దు.
  • ఒకవేళ అనుమానాస్పద మెయిల్ కానీ లేదా మెసేజ్ గానీ ఫోన్ గానీ వస్తే వెంటనే report.phishing@sbi.co.inకి రిపోర్టు చేయాలి.
  • మీ అకౌంట్ పై అనధికారిక లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా లావాదేవీ వివరాలను https://cybercrime.gov.inలో సైబర్ క్రైమ్ సెల్‌కు సమర్పించండి. అలాగే బ్యాంక్ నంబర్ 1800111109కి కాల్ చేయండి లేదా https://crcf.sbi.co.in/ccf/లో అనాథరైజ్డ్ కేటగిరీలో ఫిర్యాదు చేయండి.
  • ప్లే/యాప్ స్టోర్ నుంచి యోనో ఎస్బీఐ/యోనో లైట్ మొబైల్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోండి.
  • మీ పాస్‌వర్డ్‌లు/ఎంపిన్లను క్రమం తప్పకుండా మార్చండి.
  • మీ కంప్యూటర్/మొబైల్‌ను మాల్వేర్/యాడ్‌వేర్ లేకుండా ఉంచండి.
  • ఆన్‌లైన్ ఎస్బీఐ కోసం మీ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో యూఆర్ఎల్ని టైప్ చేయడానికి ముందు ‘https’ని ఉపయోగించండి.
  • భద్రతా ప్రమాణపత్రాన్ని వీక్షించడానికి, ధ్రువీకరించడానికి ఆన్లైన్ చిరునామా లేదా స్థితి పట్టీలో ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  • అధీకృత వాట్సాప్/కాల్ సెంటర్ నంబర్ల గురించి వివరాలను తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, https://bank.sbiని చూడండి
  • అలాగే వినియోగదారులకు మరో ముఖ్యమైన గమనిక ఏంటంటే యోనో వెబ్ పోర్టల్ అనేది 2021 డిసెంబర్ 1 నుంచి నిలిపివేశారు. యాప్ ద్వారా మాత్రమే యోనో అందుబాటులో ఉంది. అది ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • వినియోగదారులు ఫోన్లో గానీ లేదా కంప్యూటర్ లో గానీ మీ ఎస్బీఐ ఖాతా ఓపెన్ చేసి ఉన్నప్పుడు రిమోట్ యాక్సెస్ బయట వ్యక్తులకు ఇవ్వొద్దు.
  • సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను టార్కెట్ చేసి దొంగిలిస్తున్నారు. అందుకే ఆన్ లైన్ బ్యాంకింగ్ సురక్షితంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..