Best Phones: ఇది సార్ వాటి రేంజ్.. ప్రపంచాన్ని ఏలేేసిన బెస్ట్ ఫోన్లు ఏంటో తెలుసా..?

ఎవరి చేతుల్లో పట్టినా ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కనిపిస్తుంది. విభిన్న డిజైన్లు, మైమరిపించే కొత్త ఫీచర్లతో కంపెనీలు ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అప్‌గ్రేడ్ వెర్షన్ ఫోన్లకు ఎప్పటికప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్లు ఏంటో మీకు తెలుసా..?

Best Phones: ఇది సార్ వాటి రేంజ్.. ప్రపంచాన్ని ఏలేేసిన బెస్ట్ ఫోన్లు ఏంటో తెలుసా..?
Top 5 Phones

Updated on: Dec 10, 2025 | 4:56 PM

Best Smart Phones: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో మార్కె్ట్లోకి వస్తుంది. కొత్త టెక్నాలజీని ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు మొబైల్ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. పాత ఫోన్‌ను అమ్మేసి లేదా ఎక్సేంజ్‌లో ఇచ్చి అప్‌గ్రేడ్ వెర్షన్లు, కొత్త ఫీచర్లతో వచ్చే ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్లను ఫుల్ డిమాండ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల తయారీ చేసేందుకు మొబైల్ ప్రియులను ఆకట్టుకోవడానికి అనేక డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీంతో మొబైల్ విక్రయాలు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన ఫోన్లు ఏంటో మీకు తెలుసా..? టాప్ 5 ఫోన్లు ఇవే..

పాత నొకియా 1100

HowStuffWorks అనే ఓ సంస్థ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్-5 ఫోన్ల వివరాలను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం పాతకాలం నాటి నోకియా 1100 ఫోన్ తొలి స్థానంలో ఉంది. 2003లో నొకియా కంపెనీ ఈ ఫోన్ తీసుకురాగా.. ఏకంగా 25 కోట్లకుపైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. మొబైల్ కింద పడినా పగలకపోవడం, టార్చ్ లైట్, నీళ్లల్లో పడినా ఎప్పటిలాగే పనిచేయడం, ఎక్కువరోజులు వ్యాటరీ బ్యాకప్, చవక ధర వంటి ఫీచర్ల వల్ల ఈ ఫోన్ ఎక్కువమంది కొనుగోలు చేశారు. ఇక ఐఫోన్ 6, 6 ప్లస్ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. ఈ ఫోన్లను 22 కోట్లకుపైగా మంది ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేశారు. 2014లో వీటిని యాపిల్ తీసుకొచ్చింది.

శాంసంగ్ గెలాక్సీ S4, ఐఫోన్ 11

ఇక శాంసంగ్ గెలాక్సీ S4 ఫోన్ 2013లో రిలీజైంది. ఈ ఫోన్ 8 కోట్ల యూనిట్లు అమ్ముడుపోయింది. అత్యధికంగా అమ్ముడుపోయిన తొలి ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా నిలిచింది. ఆమోలోడ్ డిస్‌ప్లే, కొత్త స్టాఫ్‌వేర్ ఫీచర్ల వల్ల ఈ ఫోన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఇక ఐఫోన్ 11 2019లో మార్కెట్లోకి రాగా… ఫేస్ ఐడీ, మెరుగైనా కెమెరా వల్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. భారత్‌తో పాటు యూరప్, ఉత్తర అమెరికాలో ఈ ఫోన్ విక్రాయలు ఎక్కువగా జరిగాయి.