Smart phone: ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ ఎందుకు పేలుతుందో తెలుసా.?

|

Nov 07, 2024 | 7:23 PM

స్మార్ట్ ఫోన్‌ పేలిపోతున్న సంఘటనలను చూసే ఉంటాం. అయితే బ్యాటరీ పేలిపోవడానికి పలు కారణాలు ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మనం చేసే కొన్ని తప్పులే ఫోన్‌ పేలడానికి కారణమని అంటున్నారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Smart phone: ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ ఎందుకు పేలుతుందో తెలుసా.?
Smart Phone Blast
Follow us on

ఛార్జింగ్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్‌ పేలిందన్న వార్తలు మనం తరచూ వినే ఉంటాం. కొన్నిసార్లు ఈ పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉంటుంది. ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చూశే ఉంటాం. ముఖ్యంగా ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్‌లు పెరగడానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫోన్‌లు పేలడానికి ప్రధాన సమస్యల్లో ఓవర్‌ ఛార్జింగ్ సమస్య ప్రధాన మైంది. నిజానికి బ్యాటరీ ఫుల్‌ అవ్వగానే సర్క్యూట్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. కానీ సర్క్యూట్‌ సరిగ్గా పని చేయకపోతే బ్యాటర్‌ ఓవర్‌ ఛార్జ్‌ అవ్వడం ప్రారంభమవుతుంది. దీంతో బ్యాటరీలో అదనపు వేడి ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. ఎక్కువ సమయం ఇలాగే కొనసాగితే.. బ్యాటరీ పేలిపోవడానికి కారణమవుతుంది. ఇక ఫోన్‌ పేలడానికి బ్యాటరీ నాణ్యత కూడా ఒక కారణమని అంటున్నారు.

నాణ్యతలేమి బ్యాటరీలు ఏమాత్రం సురక్షితం కాదు. బ్యాటరీ పేలవమైన పదార్థాలతో తయారు చేసే అది వేడెక్కగానే పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్‌ ఎక్కడ పెడుతున్నామన్న అంశం కూడా బ్యాటరీ పేలడానికి కారణమవుతుందని అంటున్నారు. ఛార్జింగ్ అయ్యే సమయంలో దలదిండు కింద, టీవీలపై, ఫ్రిజ్‌ల ఉంచడం వల్ల ఫోన్‌ వేడి ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ అదనపు వేడి బ్యాటరీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా బ్యాటరీ పేలిపోతుంది.

ఇక నాణ్యతలేని ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల బ్యాటరీలు పెరగడానికి కారణమవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. క్వాలిటీ లేని ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల బ్యాటరీకి కరెంట్‌ ఎక్కువ మొత్తంలో సప్లై అవుతుంది. ఇది బ్యాటరీ వేడి పెరగడానికి కారణమవుతుంది. దీర్ఘకాలంలో బ్యాటరీ పేలడానికి ఇది కారణమవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్‌లను ఉపయోగించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..