AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malware: మీ ఫోన్‌లో ఈ సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయా.? అయితే వైరస్‌ ఉన్నట్లే. పరిష్కారం కోసం ఏం చేయాలంటే..

Malware: టెక్నాలజీ ఏలా అయితే రోజురోజుకీ అభివృద్ధి చెందుతుందో దానికి సమాంతరంగా వైరస్‌ల దాడి కూడా పెరుగుతోంది. నిత్యం ఏదో ఒక రకమైన వైరస్‌ కంప్యూటర్‌లను, స్మార్ట్‌ఫోన్‌లను అటాక్‌ చేస్తున్నాయి..

Malware: మీ ఫోన్‌లో ఈ సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయా.? అయితే వైరస్‌ ఉన్నట్లే. పరిష్కారం కోసం ఏం చేయాలంటే..
Narender Vaitla
|

Updated on: Oct 09, 2021 | 8:28 PM

Share

Malware: టెక్నాలజీ ఏలా అయితే రోజురోజుకీ అభివృద్ధి చెందుతుందో దానికి సమాంతరంగా వైరస్‌ల దాడి కూడా పెరుగుతోంది. నిత్యం ఏదో ఒక రకమైన వైరస్‌ కంప్యూటర్‌లను, స్మార్ట్‌ఫోన్‌లను అటాక్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం పెరగడం, రకరకలా యాప్‌లు అందుబాటులోకి రావడంతో కొందరు సైబర్‌ నేరగాళ్లు రకరకలా మాల్వేర్లను ఫోన్‌లలోకి జొప్పిస్తున్నారు. దీనిద్వారా వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్‌ వివరాలను కాజేస్తున్నారు. ప్రస్తుతం ఈ మాల్వేర్‌ అనేది పెద్ద సమస్యగా మారింది.

అయితే మన ఫోన్‌లోకి వైరస్‌ చొరబడిందా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే కొంతలో కొంత నష్టాన్ని తప్పించుకోవచ్చు. మరి మీ స్మార్ట్‌ ఫోన్‌లో వైరస్‌ ఉందా.? అన్న విషయాన్ని కొన్ని సిగ్నల్స్‌ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? స్మార్ట్‌ ఫోన్‌లో మాల్వేర్‌ ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..

* మీరు వినియోగించకపోయినప్పటికీ డేటా త్వరగా పూర్తవుతుందంటే మీ ఫోన్‌లో ఏదో మాల్వేర్‌ ఉన్నట్లు గుర్తించాలి. ఎందుకంటే మీ ఫోన్‌ ఇతరుల కంట్రోల్‌లోకి వెళుతుంది. కాబట్టి వారు మీ ఫోన్‌లో చేసే వాటికి మీ డేటానే ఖర్చవుతుంది.

* ఇక మీ ఫోన్‌ బ్యాటరీ మంచి కండిషన్‌తో ఉండి కూడా వెంటనే చార్జింగ్‌ తగ్గితే కూడా అనుమానించాల్సిందే. మాల్వేర్‌ ఉన్న ఫోన్‌లలో బ్యాటరీలు వేగంగా డిశ్చార్జ్‌ అవుతుంటాయి.

* మీ ఫోన్‌లో మునుపెన్నడూ లేని పాప్‌ యాడ్‌లు వుస్తున్నా మాల్వేర్‌ ఉండే అవకాశాలుంటాయి.

* స్మార్ట్‌ ఫోన్‌ పనితీరు నెమ్మదించినా ఏదో మాల్వేర్‌ ఉందని అనుమానించాలి. ఎందుకంటే వైరస్‌ కారణంగా ఫోన్‌ పనితీరు దెబ్బతింటుంది.

పై లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలంటే..

* మీ ఫోన్‌లో పైన తెలిపిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. మీరు ఫోన్‌లో ఇటీవల ఇన్‌స్టాల్‌ చేసిన కొత్త యాప్‌లను ఓసారి పరిశీలించాలి. వాటి రివ్యూలను ఓసారి చూసి ఏమైనా నెగిటివ్‌ రివ్యూలు ఉంటే వెంటనే ఆ యాప్‌ను తొలగించాలి.

* కొన్ని మాల్వేర్‌లు బ్రౌజర్‌లో కూడా తిష్ట వేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు మొబైల్‌ సెట్టింగ్‌లో ఉండే క్యాచ్‌ మెమొరినీ డిలీట్‌ చేస్తూ ఉండాలి.

* ఫోన్‌లో వైరస్‌ ఉందని అనుమానం వస్తే మంచి కంపెనీకి చెందిన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఫలితం ఉంటుంది.

* మాల్వేర్‌ ఉందని అనుమానం వస్తే ఫోన్‌ను రిసెట్‌ చేయడం ఉత్తమమైన ఆప్షన్‌. దీనివల్ల ఫోన్‌లో ఉన్న ఫైల్స్‌ అన్ని పోయి మొబైల్‌ క్లియర్‌ అవుతుంది.

Also Read: South Central Railway: వామ్మో.. ఎంత పెద్ద రైలో. 180 బోగీలు, 2 కిలోమీటర్లకు పైగా పొడవు.. వీడియో చూస్తే వావ్ అంటారు..

Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్ మహా యుద్ధం.. మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Pink Fairy Armadillo: అంతరించిపోతున్న అందమైన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో.. ఇసుకలో ఈదడం, పిల్లలకు పాలివ్వడం దీని స్పెషాల్టీ..