GotuKola plant benifits: అరె.. ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా..! అనేక వ్యాధులను నివారించే దివ్య ఔషధం..(వీడియో)
ఇంట్లో అందం కోసం మనం పెంచుకునే మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలుంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. అటువంటి మొక్కల్లో 'గోతు కోలా' ఒకటి. ఇది చాలా సులభంగా పెరుగుతుంది. ఆసియా దేశాల వంటకాల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకు కూరలాంటి మొక్క ఇది.
ఇంట్లో అందం కోసం మనం పెంచుకునే మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలుంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. అటువంటి మొక్కల్లో ‘గోతు కోలా’ ఒకటి. ఇది చాలా సులభంగా పెరుగుతుంది. ఆసియా దేశాల వంటకాల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకు కూరలాంటి మొక్క ఇది. తీపి , చేదు రుచితో పాటు సువాసన కలిగి ఉంటుంది. ఈ ఆకుని శ్రీలంక లో ఫేమస్ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇక సాంప్రదాయ చైనీస్ వైద్యం పాటు మనదేశంలో ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. గోతు కోలా ఆకుతో టీ కూడా చేసుకుని తీసుకుంటారు. ఇంకా ఈ మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
గోతు కోలా మొక్క జ్ఞాపకశక్తిని పెంచే దివ్య ఔషధం. నాడీ వ్యవస్థను పునరుజ్జీవించి ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాదు ఈ ఆకు గాయాలను సైతం మాన్పగలదు. ఈ ఆకు రసం రాస్తే ఎలాంటి గాయమైనా మాయమైపోతుంది. మచ్చకూడా ఉండదంటే నమ్మండి… ఇంకా ఈ ఆకులను క్రమం తప్పకుండా ఏదోక రూపంలో తీసుకుంటే త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుందట. గోతు కోలా క్యాప్సూల్, పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇది అంటువ్యాధులను అరికట్టడంలో దిట్ట. అంతేకాదు అల్జీమర్స్ వ్యాధి, రక్తం గడ్డకట్టడం వంటి వాటిని అరికడుతుంది. మానసిక ఆందోళన, ఉబ్బసం, మధుమేహం, విరేచనాలు, అలసట, అజీర్ణం, వంటి అనేక వ్యాధులను నివారిస్తుందని సాంప్రదాయ వైద్యులు చెప్తారు. గోతు కోలా జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుందని 2017 లో శాస్త్రీయంగా నిరూపించారు కూడా. దీర్ఘకాలిక సిరల లోపం ‘సివిఐ’ ఉన్నవారిలో గోతు కోలా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని ఆధారాలతో సహా 2013 లో మలేషియా నిఫుణులు నిరూపించారు. గోతు కోలాతో చికిత్స పొందిన వృద్ధుల్లో రక్త ప్రసరణ మెరుగుపడిందట.
మరిన్ని చదవండి ఇక్కడ : Wedding Viral Video: ఈ కొత్త జంట ఐడియా అదిరిందిగా..! జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ నెట్టింట వైరలవుతున్న వీడియో..
Covid Crisis Support: తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్..ఎక్కడ..ఎలా?(వీడియో)
Maa Elections 2021: నాగబాబు వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్.. రేపటి పోరులో ఎం జరగనుంది..(లైవ్ వీడియో)