రూ.12 వేలకే మోటో నుంచి అమేజింగ్ ఫోన్ .. ఇప్పుడు కొంటే భారీ డిస్కౌంట్..

దేశీయ స్మార్ట్‌ఫోన్ సంస్థ అయిన మోటోరొలా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో Moto G57 Power ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్‌తో పాటు ఎక్సేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్లు ఒకసారి చూద్దాం.

రూ.12 వేలకే మోటో నుంచి అమేజింగ్ ఫోన్ .. ఇప్పుడు కొంటే భారీ డిస్కౌంట్..
Motorola

Updated on: Nov 24, 2025 | 2:34 PM

Moto G57 Power: భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా ఇటీవల వరుసపెట్టి ఫోన్లను మార్కెట్లోకి తెస్తోంది. హై బడ్జెట్ ఫోన్లతో పాటు మిండ్ రేజ్, తక్కువ ధర గల అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను లాంచ్ చేస్తోంది. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో భాగంగా ఇతర సంస్థలకు పోటీగా ఫోన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది మోలా. అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో Moto G57 Powerను మొబైల్ ప్రియుల కోసం మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.

ఫీచర్లు , స్పెసిఫికేషన్లు

-6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే

-120Hz రిఫ్రెష్‌ రేటు

-120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేటు

-వెనకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా

-8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా

-ముందువైపు 8 ఎంపీ సెల్పీ కెమెరా

-7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

-33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌

-బ్లూటూత్‌ 5.1, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై

-యూఎస్‌బీ టైప్‌-సి ఛార్జింగ్ పోర్ట్‌

-ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్ సిస్టమ్

-స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్

-IP64 రక్షణ

ఫోన్ ధర

Moto G57 Power ఫోన్ ధర రూ. 14, 999గా ఉంది. ఇది 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ లో లభిస్తుంది. కంపెనీ ధర అదే అయినప్పుటికీ.. ప్రస్తుతం లాంచింగ్ ఆఫర్ కింద రూ.12,999కే అందిస్తోంది. డిసెంబర్ 3 నుంచి ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు విక్రయానికి ఉంచనున్నట్లు మోటోరొలా స్పష్టం చేసింది. ఈ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో ఈ ఫోన్‌ను రూపొందించారు. రెగాట్టా, పాంటోన్ కార్సెయిర్, పాంటోన్ ప్లుయిడీ కలర్ ఆప్షన్లతో ఫోన్ ఉండనుంది. ఎస్‌బీఐ లేదా యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 డిస్కౌంట్ వస్తోంది. ఇక ఫోన్ ఎక్సేంజ్‌పై అదనంగా మరో రూ.వెయ్యి డిస్కౌంట్ లభిస్తోంది