
December Lunch Phones: అత్యాధునిక ఫీచర్లతో వచ్చే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొబైల్ ప్రియులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే కొత్త టెక్నాలజీతో వచ్చే ఫోన్ల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. ఎప్పుడు ఏ ఫోన్ విడుదల అవుతుందా? అని వేచి చూస్తూ ఉంటారు. ప్రతీ నెలా ఏదొక కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. డిసెంబర్‌లో చాలా కంపెనీల ఫోన్లు మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. దీంతో కొత్త ఫోన్లు కొనేవారికి మార్చి నెల ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలైన వన్‌ప్లస్, రెడ్ మీ, వివో, రియల్ మీ వంటి పెద్ద బ్రాండ్‌ల నుండి కొత్త ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు ఏంటో చూద్దాం.
డిసెంబర్ 2న ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. X300 200-మెగాపిక్సెల్ టెలిఫోటో, 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తుంది.
డిసెంబర్ 3వ తేదీన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ విక్రయానికి ఉండనుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 15లో హైపర్‌ఓఎస్ వస్తోంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్.. బ్యాక్ సైడ్ 50MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్+ 128GB వేరియంట్ ధర రూ.12,499, 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.13,999, 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.14,999గా ఉండనుంది.
డిసెంబర్ 4న ఈ ఫోన్ లాంచ్ కానుంది. 7000mAh బ్యాటరీతో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్, 45W ఫాస్ట్ ఛార్జ్, 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 10GB వర్చువల్ RAMతో 8GB RAM, కూలింగ్ సిస్టమ్, 50-మెగాపిక్సెల్ AI కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.