Best Laptops Under 35K: తక్కువ ధరలో టాప్ ల్యాప్ టాప్స్ ఇవి.. బెస్ట్ బ్రాండ్స్.. స్టైలిష్ డిజైన్..
ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ లకు డిమాండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ మాత్రమే వినియోగించే వారు. కానీ ఇప్పుడు చదువులన్నీ డిజిటల్ బాటపట్టడంతో విద్యార్థులకు ఇవి అత్యవసరంగా మారుతున్నాయి. ఇక బిజినెస్ లు చేసే వారు కూడా ల్యాప్ టాప్ లు ఎక్కువగానే వాడుతున్నారు.

ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ లకు డిమాండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ మాత్రమే వినియోగించే వారు. కానీ ఇప్పుడు చదువులన్నీ డిజిటల్ బాటపట్టడంతో విద్యార్థులకు ఇవి అత్యవసరంగా మారుతున్నాయి. ఇక బిజినెస్ లు చేసే వారు కూడా ల్యాప్ టాప్ లు ఎక్కువగానే వాడుతున్నారు. అయితే మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ ధర వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రూ. 35,000లోపు బడ్జెట్లో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్ టాప్ లు దొరకడం కాస్త కష్టమైన పనే. అయితే యాసర్, హెచ్పీ, అసుస్ వంటి బ్రాండ్లలో ఈ స్పెసిఫికేషన్ తో ల్యాప్ టాప్స్ రూ. 35,000లోపు బడ్జెట్లోనే లభ్యమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15..
మన దేశంలో రూ. 35,000లోపు ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్ లలో ఇదీ ఒకటి. దీనిలో ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్ ఉంటుంది. దీని సాయంతో రోజూ వారి పనులను సమర్థంగా నిర్వహిస్తుంది. 15.6 అంగుళాల హెచ్‌డీ మైక్రో ఎడ్జ్ డిస్ ప్లే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అంతేకాక ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్స్, క్వాలిటీ విజువల్స్ ని అందిస్తుంది. దీని ధర రూ. 27,990గా ఉంది.
అసుస్ వివో బుక్15..
రూ. 35,000లోపు బడ్జెట్లో ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి ఇది స్మార్ట్ చాయిస్. అధిక పనితీరుతో పాటు స్టైలిష్ లుక్ ఇది కనిపిస్తుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్ ఉంటుంది. 15.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, స్లిమ్ డిజైన్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు చాలా మంచి ఎంపిక ఇది. దీని ధర రూ. 26,990గా ఉంది.
యాసర్ వన్ 14..
దీనిలో ఏఎండీ రైజన్ 3 3250యూ ప్రాసెసర్ ఉంటుంది. ఇది అధిక పనితీరుతో పాటు పోర్టబుల్ గా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది. దీనిలో ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, 14.0 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ. 27,990గా ఉంది.
హెచ్‌పీ 15ఎస్..
దీనిలో ఏఎండీ అథ్లాన్ సిల్వర్ 3050యూ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 15.6 అంగుళాల హెచ్ డీ మైక్రో ఎడ్జ్ డిస్ ప్లే ఉంటుంది. ఏఎండీ రేడియాన్ గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్స్, క్లియర్ ఆడియో, వీడియో అందిస్తుంది. విండోస్ 11 ఆపరరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 28,490 ఉంటుంది.
అసుస్ వివో బుక్ జీఓ 14..
దీనిలో ఏఎండీ రైజెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు సరిగ్గా సరిపోతుంది. 14 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. బిల్ట్ అలెక్సా ఉంటుంది. దీని ధర రూ. 33,250గా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
