Affordable Laptops: బెస్ట్‌ ల్యాప్‌టాప్‌లు. రూ.40 వేల లోపు ధర, అత్యుత్తమ ఫీచర్లు..

సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న వీటి ప్రత్యేకతలు, పనితీరు చాలా బాగుంది. వీటిలోని ఐ5 ప్రాసెసర్లు, మంచి వేగం, బహుళ టాస్కింగ్ సామర్థ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన చార్జింగ్‌తో విద్యార్థులకు, గేమర్లకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో రూ.40 వేల లోపు లభిస్తున్న ఉత్తమ ల్యాప్‌టాప్‌లను తెలుసుకుందాం.

Affordable Laptops: బెస్ట్‌ ల్యాప్‌టాప్‌లు. రూ.40 వేల లోపు ధర, అత్యుత్తమ ఫీచర్లు..
Laptops
Follow us
Madhu

|

Updated on: Apr 06, 2024 | 12:33 PM

డిజిటలైజేషన్ నేపథ్యంలో ల్యాప్ టాప్‌ల వినియోగం దేశంలో బాగా పెరిగింది. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకూ అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అనేక మంచి ఫీచర్లతో వివిధ రకాల ల్యాప్ టాప్ లు మార్కెట్ లోకి వస్తున్నాయి. వీటిలో ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తో రూ.40 వేల ల్యాప్ టాప్ లు ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న వీటి ప్రత్యేకతలు, పనితీరు చాలా బాగుంది. వీటిలోని ఐ5 ప్రాసెసర్లు, మంచి వేగం, బహుళ టాస్కింగ్ సామర్థ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన చార్జింగ్‌తో విద్యార్థులకు, గేమర్లకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో రూ.40 వేల లోపు లభిస్తున్న ఉత్తమ ల్యాప్‌టాప్‌లను తెలుసుకుందాం.

జెబ్రోనిక్స్ ప్రో సిరీస్ జెడ్..

ఇంటెల్ కోర్ ఐ5-1235యూ 12వ జెనరేషన్ ప్రాసెసర్‌ ఉన్న జెబ్రోనిక్స్ ల్యాప్‌టాప్‌ మన పనిని వేగవంతం చేస్తుంది. వెబ్ బ్రౌజింగ్, మల్టీమీడియా, మల్టీ టాస్కింగ్‌ను సులభంగా చేసుకోవచ్చు. ఐపీఎస్ డిస్‌ప్లే కారణంగా స్పష్టత చాలా బాగుంటుంది. హెచ్‌డీ 1920×1080 పిక్సల్ రిజల్యూషన్‌, విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, 4.4 జీహెచ్ జెడ్ వేగం కలిగిన ప్రాసెసర్, పది గంటల బ్యాటరీ సామర్థ్యం తదితర ప్రత్యేకతలు కలిగిన ఈ ల్యాప్ టాప్ ధర రూ. 34,990. అయితే కొందరు వినియోగదారులు దీని బ్యాటరీ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

లెనోవా థింక్ ప్యాడ్ 5వ జెన్..

ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీతో ఇంటెల్ కోర్ ఐ5 5200యూ 2.2 జీహెచ్ జెడ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్ డీ స్టోరేజీ దీని ప్రత్యేకతలు. విండోస్ 10 ప్రో, ఎంఎస్ ఆఫీస్, వెబ్‌క్యామ్, మైక్రోఫోన్‌, 14 అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లే ఆకట్టుకుంటున్నాయి. యూఎస్ బీ, సెక్యూరిటీ లాక్ స్లాట్, బీజీఏ పోర్ట్, ఎల్ ఏఎన్ పోర్ట్ (ఆర్జే-45), పవర్ కనెక్టర్, బ్లూటూత్‌తో కూడిన హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ కాంబో జాక్ రీడర్‌తో పాటుగా వస్తుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ సులభం. ఈ ల్యాప్ టాప్ రూ. 15,999కు అందుబాటులో ఉంది. దీని ప్రాసెసర్ వేగం 2.2 జీహెచ్ జెడ్. దీనిని ఉపయోగించడం చాలా సులభం.

ఇవి కూడా చదవండి

జెబ్రోనిక్స్ ప్రో సిరీస్ వై..

ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ఐ5-1155జీ7 11వ జెన్ ప్రాసెసర్‌ ఉంది. అప్‌గ్రేడబుల్ 512జీబీ ఎం.2 ఎస్ఏ టీఏ ఎస్ఎస్ డీ, 8 జీబీ ర్యామ్ కారణంగా పనిని వేగంగా చేసుకోవచ్చు. మెటల్-బాడీ ల్యాప్‌టాప్‌ ఎంతో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్‌తో జత చేయబడిన 2.4 జీహెచ్ జెడ్, 5జీహెచ్ జెడ్ బ్యాండ్‌విడ్త్‌కు అనుకూలంగా ఉండే వైఫై కనెక్షన్‌తో పనితీరు బాగుంటుంది. 8 జీబీ ర్యామ్, 3200 ఎంహెచ్ జెడ్ మెమరీ క్లాత్ స్పీడ్, ఎస్ఎస్ డీ హార్డ్ డిస్క్, 2.5 జీహెచ్ జెడ్ ప్రాసెసర్ వేగం కలిగిన ఈ ల్యాప్ టాప్ ధర రూ.28,990. మంచి ఫీచర్లతో అందుబాటు ధరలో ఉండడం దీని ప్రత్యేకత. అయితే కొందరు వినియోగదారులు దీని హీట్ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు.

జెబ్రోనిక్స్ ప్రో సిరీస్ జెడ్..

స్టైలిష్ లుక్, పొర్టబుల్ సైజులో ఉండే ఈ ల్యాప్ టాప్ లో ఇంటెల్ కోర్ 12వ జెన్ ఐ5 ప్రాసెసర్ ఉన్నాయి. ఐపీఎస్ డిస్‌ప్లే, పూర్తి హెచ్ డీ 1920×1080 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ కారణంగా ఆఫీసు వర్క్, డాక్యుమెంటేషన్, వెబ్ సర్ఫింగ్, మల్టీమీడియా సులభంగా చేసుకోవచ్చు. 39.6 సీఎం (15.6 అంగుళాలు) స్క్రీన్ పరిమాణంతో ఈ స్లిమ్, క్లాసీ ల్యాప్‌టాప్‌ ఆకట్టుకుంటున్న ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 33,990.

ఎంఎస్ఐ కోర్ ఐ5 12వ జెన్..

కొత్త ఎంఎస్ఐ ల్యాప్‌టాప్ లో 12వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉండడం వల్ల వేగవంతంగా పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం టచ్‌ప్యాడ్‌ అమర్చారు. ఫ్లిప్-ఎన్-షేర్ ఫంక్షన్‌తో ఒకే క్లిక్‌తో స్క్రీన్‌ను షేర్ చేయడానికి వీలుంటుంది. ఈ తేలికైన ల్యాప్‌టాప్ తీసుకువెళ్లడం సులభం. అనేక పోర్ట్‌లు కలిగి ఉండడంతో ఒకేసారి వివిధ పరికాలను కనెక్ట్ చేయవచ్చు. 8 జీబీ ర్యామ్, మిలిటరీ-గ్రేడ్ మన్నికను కలిగిన ఈ ల్యాప్ టాప్ రూ.39,135 ధరకు అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..