Whatsapp Update: వాట్సాప్‌లో ఆకర్షిస్తున్న నయా అప్‌డేట్.. ఇక ఆ మెసేజ్‌లు రావంతే..!

|

Aug 21, 2024 | 7:30 AM

సన్నిహితులతో మెసేజ్‌లు, కాల్స్, వీడియో కాల్స్ చేసే అవకాశం ఉండడంతో వాట్సాప్ తక్కువ సమయంలోనే ప్రజాదరణను బాగా పొందింది. అయితే మనకు తెలియని నెంబర్స్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తుండడం సగటు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా మహిళలకైతే ఇలాంటి ఆకతాయి మెసేజ్‌లు ఎక్కువగా వచ్చి ఇబ్బందిపెడుతున్నాయి. అలాగే వివిధ స్కామ్‌లు చేసేవారు కూడా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అనుమానాస్పద లింక్‌లు పంపుతున్నారు.

Whatsapp Update: వాట్సాప్‌లో ఆకర్షిస్తున్న నయా అప్‌డేట్.. ఇక ఆ మెసేజ్‌లు రావంతే..!
Whatsapp
Follow us on

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ ఫోన్స్‌లో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. సన్నిహితులతో మెసేజ్‌లు, కాల్స్, వీడియో కాల్స్ చేసే అవకాశం ఉండడంతో వాట్సాప్ తక్కువ సమయంలోనే ప్రజాదరణను బాగా పొందింది. అయితే మనకు తెలియని నెంబర్స్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తుండడం సగటు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా మహిళలకైతే ఇలాంటి ఆకతాయి మెసేజ్‌లు ఎక్కువగా వచ్చి ఇబ్బందిపెడుతున్నాయి. అలాగే వివిధ స్కామ్‌లు చేసేవారు కూడా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అనుమానాస్పద లింక్‌లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలను అరికట్టేలా వాట్సాప్ త్వరలోనే కొత్త అప్‌డేట్ తీసుకుని వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నోన్ అకౌంట్స్ పేరుతో లాంచ్ చేస్తున్న ఈ సర్వీసు వినియోగదారులను చాలా ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ నయా అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నోన్ అకౌంట్స్ అనేది తెలియని ఖాతాల నుంచిసందేశాలను నిరోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ  అందుబాటులో లేదు. వాట్సాప్ బీటా వినియోగదారులకు ప్రస్తుతం పరీక్షల దవ కింద అందుబాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం వాట్సాప్ వినియోగదారులను స్పామ్ బారిన పడకుండా రక్షించడమే వాట్సాప్ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. వాట్సాప్ ఆధారిత మోసాలు, ఇతర సైబర్ మోసాల గురించి గత కొన్ని రోజులుగా పెరుగుతున్న దృష్ట్యా వాట్సాప్ ఈ నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం క్లౌడ్ సెక్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ మౌరిస్‌బాట్ అనే మాల్వేర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుందని నివేదించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి వినియోగదారులకు మేలు చేసేలా నయా అప్‌డేట్ తీసుకువస్తుంది.

మౌరిస్‌బాట్ వాట్సాప్‌లో నకిలీ ట్రాఫిక్ చలాన్ సందేశాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మెసేజ్‌లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే హానికరమైన యాప్‌ను ఆటోమెటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. వియత్నాంకు చెందిన హ్యాకర్లు కొత్త మాల్వేర్ ‘మౌరిస్‌బాట్’ని పెద్ద ఎత్తున ఎలా ఉపయోగిస్తున్నారనే వివరాలను కూడా నివేదిక హైలైట్ చేసింది. దీని నుంచి వినియోగదారులను రక్షించడానికి వాట్సాప్  బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నోన్ అకౌంట్స్ ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుందని, ఇది ఇప్పటికే ఉన్న ‘బ్లాక్ అన్‌నోన్ కాలర్స్’ మాదిరిగానే ఉంటుంది. అయితే ఒక ట్విస్ట్ ఉంది. కొత్త ఫీచర్ ‘నిర్దిష్ట పరిమితి’ దాటిన తర్వాత తెలియని వారికి మెసేజ్‌లు పంపడాన్ని అనుమతించదు. అయితే ఈ ‘నిర్దిష్ట పరిమితి’కి సంబంధించిన కచ్చితమైన నిర్వచనం పేర్కొనలేదు.  

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..