
వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇది వచ్చినప్పటి నుంచి ప్రజలు నేరుగా మాట్లాడుకోవడమే తగ్గిపోయింది. ఏం మాట్లాడాలన్న ఈ యాప్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ అకౌంట్ తప్పక ఉంటుంది. అయితే వాట్సాప్‌కు గట్టి పోటీనిచ్చే మరో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ తరచుగా వివాదాలను ఎదుర్కొంటుంది. సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో ఉత్తమమైన యాప్‌గా పేరు పొందినప్పటికీ.. ఈ ప్లాట్‌ఫామ్‌ను తరచుగా తీవ్రవాద గ్రూపులు కూడా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా కొన్ని దేశాలు ఈ యాప్‌ను పూర్తిగా నిషేధించాయి. వాట్సాప్‌కు ప్రత్యర్థిగా నిలిచిన టెలిగ్రామ్ నిషేధించబడిన ఆ 6 దేశాలు ఏంటో తెలుసుకుందాం..
మానవ హక్కుల న్యాయవాదులు, కార్యకర్తలు నిరసనల కోసం టెలిగ్రామ్‌ను ఉపయోగించారని చైనా ఆరోపించింది. జాతీయ భద్రతా సమస్యలను కారణంగా చూపి 2015 నుండి ఈ యాప్‌ను నిషేధించింది.
2018లో జరిగిన నిరసనల్లో ఈ యాప్‌ను విపరీతంగా ఉపయోగించడంతో పాటు తప్పుడు కంటెంట్ వ్యాప్తికి కారణమవుతోందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్‌ను నిషేధించింది. నిషేధానికి ముందు టెలిగ్రామ్ ఆ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా ఉండేది.
2025లో వియత్నాం ప్రభుత్వం కూడా ఈ యాప్‌పై నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.
భద్రతా కారణాలు, స్థానిక కంటెంట్ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి నిరాకరించడంతో పాకిస్తాన్‌లో కూడా టెలిగ్రామ్ యాప్‌ను నిషేధించారు.
2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కోసం టెలిగ్రామ్‌ను విపరీతంగా ఉపయోగించడం వల్ల థాయిలాండ్ ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది.
2024 సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ప్రభుత్వ సంస్థలు, సైనిక సిబ్బంది అధికారిక ఫోన్లు, సిస్టమ్స్‌లో టెలిగ్రామ్ వాడకాన్ని నిషేధించింది. రష్యన్ నిఘా సంస్థలు టెలిగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను యాక్సెస్ చేయగలవని సైనిక నిఘా సంస్థ వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కారణంతో ఉక్రెయిన్‌లో ఈ యాప్ పూర్తి నిషేధానికి దారి తీయవచ్చు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..