Tech News: మీ ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

Tech News: మీ ఫోన్‌ను ప్రకాశవంతమైన సూర్యకాంతిలో లేదా వేడి వాతావరణంలో ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది. మీ ఫోన్‌ను దిండు కింద ఉంచడం, మందపాటి కవర్ ఉపయోగించడం లేదా వెంటిలేషన్‌ను నిరోధించడం వల్ల కూడా వేడి పెరుగుతుంది. చాలా మంది వినియోగదారులు..

Tech News: మీ ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

Updated on: Dec 14, 2025 | 12:46 PM

Tech News: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్‌లు చాలా అవసరం అయ్యాయి. కాల్‌లు చేయడం నుండి ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం వరకు ప్రతిదానికీ వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే తరచుగా వేడెక్కడం వినియోగదారులకు ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది దీనిని బ్యాటరీ వైఫల్యానికి ఆపాదిస్తే, మరికొందరు ఛార్జర్‌ను నిందిస్తారు. వాస్తవానికి ఫోన్ వేడెక్కడానికి తరచుగా ఒక సాంకేతిక కారణం ఉంటుంది. ఒకటి మాత్రమే కాదు.. చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణాలను వెంటనే పరిష్కరించకపోతే ఫోన్ పనితీరు, జీవితకాలం ప్రభావితమవుతుంది.

ప్రాసెసర్ పై అధిక వినియోగం, అధిక లోడ్:

మీరు నిరంతరం ఆటలు ఆడుతున్నప్పుడు, వీడియోలను సవరించినప్పుడు లేదా ఎక్కువసేపు కెమెరాను ఉపయోగించినప్పుడు ఫోన్ ప్రాసెసర్ ఎక్కువగా పనిచేస్తుంది. ఈ సమయంలో CPU, GPU వేగంగా పనిచేస్తాయి. ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా హై-గ్రాఫిక్స్ గేమ్‌లు, 4K వీడియో రికార్డింగ్ ఫోన్‌ను త్వరగా వేడెక్కేలా చేస్తాయి. బలహీనమైన కూలింగ్‌ వ్యవస్థలు ఉన్న ఫోన్‌లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో ఫోన్‌కు విరామం ఇవ్వడం చాలా అవసరం అవుతుంది.

ఇది కూడా చదవండి: Messi Flight: మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది? అంత ప్రత్యేకత ఏంటి?

ఇవి కూడా చదవండి

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది?

మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ లోపల రసాయన ప్రతి చర్యలు జరిగి వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఛార్జ్ అవుతున్నప్పుడు మీ ఫోన్‌ను ఉపయోగించడం వల్ల ఈ వేడి మరింత పెరుగుతుంది. లోకల్ లేదా ఫాస్ట్ ఛార్జర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌లు వేడెక్కడం సర్వసాధారణం.

బ్యాక్‌రౌండ్‌ యాప్‌లు, సాఫ్ట్‌వేర్ లోపాలు{

తరచుగా, అధిక యాప్‌లు బ్యాక్‌ రౌండ్‌లో రన్‌ అవుతుంటాయి. నిరంతరం ప్రాసెసర్, RAMని ఉపయోగిస్తాయి. అదనంగా ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయకపోతే లేదా యాప్‌లో బగ్ ఉంటే అది కూడా ఫోన్ వేడెక్కడానికి కారణమవుతుంది. మాల్వేర్ లేదా హానికరమైన యాప్‌లు నిశ్శబ్దంగా సిస్టమ్ వనరులను వినియోగిస్తాయి. దీనివల్ల ఎక్కువ ఉపయోగం లేకుండానే ఫోన్ వేడెక్కుతుంది.

ఇలా చేస్తే కూడా వెడెక్కుతుంది:

మీ ఫోన్‌ను ప్రకాశవంతమైన సూర్యకాంతిలో లేదా వేడి వాతావరణంలో ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది. మీ ఫోన్‌ను దిండు కింద ఉంచడం, మందపాటి కవర్ ఉపయోగించడం లేదా వెంటిలేషన్‌ను నిరోధించడం వల్ల కూడా వేడి పెరుగుతుంది. చాలా మంది వినియోగదారులు తమ ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచుతారు. దీనివల్ల బ్యాటరీపై అదనపు ఒత్తిడి వస్తుంది. ఈ చిన్న తప్పులు వేడెక్కడానికి ప్రధాన కారణం కావచ్చు.

ఇది కూడా చదవండి: Messi Flight: మెస్సీ ప్రయాణించిన విమానం ఖర్చు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది? అంత ప్రత్యేకత ఏంటి?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి