WhatsApp Service: షాకింగ్‌.. ఈ ఫోన్‌లలో జనవరి 1 నుంచి వాట్సాప్‌ బంద్‌..ఇందులో మీ ఫోన్ కూడా ఉందా చెక్ చేసుకోండి!

|

Dec 29, 2024 | 2:42 PM

WhatsApp Service: యూజర్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడంతో పాటు భద్రతాపరంగానూ వాట్సప్‌ (Whatsap) ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంటుంది. యాప్‌లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు కొత్త టెక్నాలజీని అందుకోలేని పాత ఫోన్లకు తన సపోర్ట్‌ను నిలిపివేస్తూ ఉంటుంది. కొత్త ఏడాదిలోనూ కొన్ని ఫోన్లకు వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఆ ఫోన్‌లు ఏంటో చూద్దాం..

WhatsApp Service: షాకింగ్‌.. ఈ ఫోన్‌లలో జనవరి 1 నుంచి వాట్సాప్‌ బంద్‌..ఇందులో మీ ఫోన్ కూడా ఉందా చెక్ చేసుకోండి!
Follow us on

ఈ రోజుల్లో వాట్సాప్‌ లేని స్మార్ట్‌ ఫోన్‌ అంటూ ఉండదేమో. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. అంతేకాకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సహా పనులకు వాట్సాప్ చాలా అవసరం. ముఖ్యంగా పాఠశాల నుంచి కళాశాల వరకు పాఠ్యాంశాల ప్యాకేజీలను కూడా వాట్సాప్ ద్వారా అందజేస్తున్నారు. ఈ రోజుల్లో వాట్సాప్‌ ద్వారా ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ సంస్థ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. కొన్ని ఫోన్‌లకు వాట్సాప్‌ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయడం నిలిపివేస్తున్నట్లు కూడా నివేదికలు ఉన్నాయి. ఫలితంగా లక్షలాది మంది వాట్సాప్ యూజర్లు ఇబ్బంది పడతారు. అంటే చాలా మంది పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కూడా ఈ సేవను ఉపయోగించడం కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: SIM Card New Rule: షాకింగ్‌ న్యూస్‌.. ఈ వ్యక్తులు 3 సంవత్సరాల పాటు సిమ్ కార్డ్ పొందలేరు.. !

ఇవి కూడా చదవండి

ఆధునిక OS, హార్డ్‌వేర్ అవసరమయ్యే కొత్త ఫీచర్లను WhatsApp పరిచయం చేయబోతోంది. ఈ కొత్త ఫీచర్లు అమల్లోకి రానున్నట్టు సమాచారం. దీని కారణంగా ఐఫోన్‌లతో పాటు వివిధ స్మార్ట్‌ఫోన్‌లు వాట్సాప్ సేవలను కోల్పోతాయని చెబుతున్నారు.

ఎవరు పొందలేరు

సాంకేతికంగా చెప్పాలంటే, Android KitKat 10 సంవత్సరాల క్రితం విడుదలైంది. ఇప్పుడు మెసేజింగ్ యాప్‌లకు సపోర్ట్‌ను కోల్పోనున్నారు. అంటే ఆ ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు. అందుకే కిట్‌క్యాట్ వెర్షన్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగించే వ్యక్తులు వాట్సాప్ సేవను పొందలేరు. WhatsApp ఉపయోగించడం కొనసాగించడానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడం అవసరం. పాత వెర్షన్‌ ఫోన్‌లు ఇప్పటికి చాలా మంది వినియోగిస్తున్నారు. అలాంటి ఫోన్‌లకు జనవరి 1వ తేదీ నుంచి వాట్సాప్‌ నిలిపోనుంది.

ఏ ఫోన్లలో WhatsApp పని చేయదు:

Samsung Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, HTC One X, One X Plus, Desire 500, Desire 601, Sony Xperia Z, Xperia SB, Xperia V, LG Optimus G, Nexus 4, G2 Mini, L90. ఇంకా, జనవరి 1 నుండి మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు మోటో జి, రాస్ హెచ్‌డి, మోటో ఇ 2014 నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి