గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40వేల ఉద్యోగాలు

| Edited By:

Jul 14, 2020 | 11:14 AM

కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ నిరుద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది.

గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40వేల ఉద్యోగాలు
Follow us on

కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ నిరుద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారతదేశంలో 40వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు వివరించింది. అయితే ఈ నియామకాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని తెలిపింది. టీసీఎస్‌ ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం.. కరోనా వలన గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం తగ్గినప్పటికీ.. తమ సంస్థ‌ మాత్రం తన నియామకాలను తగ్గించుకోదని స్పష్టం చేశారు. ఇక అమెరికాలో  కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 2,000 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. దీని వలన హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడుతోంది. ఇంజనీర్లను మాత్రమే కాకుండా అమెరికాలో టాప్ 1 బి-స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. అయితే 2014 నుంచి టీసీఎస్ 20 వేల మందికి పైగా అమెరికన్లను నియమించుకున్న విషయం తెలిసిందే.