చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Xiaomi తన కొత్త Xiaomi 13 లైనప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. Xiaomi 13 Pro ఫిబ్రవరిలో భారతదేశానికి వచ్చింది. ఈ లైనప్‌లో అత్యంత ఖరీదైన ఫోన్ Xiaomi 13 అల్ట్రా మోడల్ కూడా ఇటీవలే చైనాలో లాంచ్ చేయబడింది. మే నెలలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఈ అల్ట్రా మోడల్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలాఉంటే.. Xiaomi తన సమ్మర్ సేల్ ఆఫర్ ప్రకటించింది. ఈ సేల్‌లో, Xiaomi మొబైల్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. వాటిలో, Xiaomi 12 Pro, Redmi K50i ఫోన్లపై అద్దిరిపోయే ఆఫర్స్ ఇచ్చింది. ఈ రెండు ఫోన్లపై ఎంత డిస్కౌంట్ ప్రకటించింది, వీటి ధర ఎంత, ఫీచర్స్ ఏంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Xiaomi 12 Pro భారతదేశంలో రూ. 62,999 ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఈ సమ్మర్ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.20,000 తగ్గింపు ప్రకటించింది కంపెనీ. ఫలితంగా, మీరు Xiaomi 12 pro ని కేవలం రూ. 42,999కి పొందవచ్చు. ఇక, Redmi K50i ఫోన్ భారతదేశంలో రూ. 23,999 ధర ఉండగా.. ఈ ఫోన్‌ని సమ్మర్ సెల్‌లో రూ. 19,499కి పొందే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ డిస్కౌంట్లను పొందవచ్చు. mi.com, Mi Home, Mi రిటైల్ భాగస్వాముల వద్ద కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
Xiaomi 12 Pro: స్మార్ట్‌ఫోన్ పనితీరు కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ ఆధారితమైన AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఒక్కో సెన్సార్ 50MP. ప్రధాన సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. మిగిలిన రెండు సెన్సార్లు అల్ట్రా-వైడ్ లెన్స్, టెలిఫోటో యూనిట్. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ఉంది. మరో ముఖ్యమైన ఫీచర్ కార్డాన్ ట్యూన్డ్ డ్యూయల్ స్పీకర్ సెటప్. అలాగే ఈ ఫోన్ 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Redmi K50i: గేమింగ్ ఫోకస్డ్ పరికరం 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ పనితీరు కోసం MediaTek Dimension 8100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5G ప్రారంభించబడిన Redmi K50i ఫోన్ మొత్తం మూడు రంగులలో అందుబాటులో ఉంది. ఫాంటమ్ బ్లూ, క్విక్ సిల్వర్, స్టెల్త్ బ్లాక్. IP53 సర్టిఫైడ్ ఫోన్‌లో IR సెన్సార్, డాల్బీ అట్మాస్ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 64MP ప్రైమరీ సెన్సార్, 16MP ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఫోన్ బాక్స్‌తో పాటు 27W PD సపోర్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..