Iphone: భారత్‌లో రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు తగ్గనున్న ఐఫోన్‌ ధరలు.. కారణమేంటంటే..

|

Dec 02, 2022 | 12:53 PM

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ బ్రాండ్స్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఐఫోన్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. యాపిల్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చిందంటే చాలు ఎగబడి కొనేసే వాళ్లు ఉంటారు. సెక్యూరిటీ, అధునాతన ఫీచర్లకు..

Iphone: భారత్‌లో రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు తగ్గనున్న ఐఫోన్‌ ధరలు.. కారణమేంటంటే..
Iphone Price
Follow us on

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ బ్రాండ్స్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఐఫోన్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. యాపిల్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చిందంటే చాలు ఎగబడి కొనేసే వాళ్లు ఉంటారు. సెక్యూరిటీ, అధునాతన ఫీచర్లకు పెట్టింది పేరైన ఐఫోన్‌ ధర కూడా చుక్కలు తాకేలా ఉంటాయి. ఇందులోని ఫీచర్లు, ఉపయోగించే మెటీరియలే దీనికి కారణం. ఐఫోన్‌ కొనాలంటే రూ. లక్షలు పెట్టాల్సిందే. అయితే భారత్‌లో రానున్న రోజుల్లో యాపిల్ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీనికి కారణం భారత్‌లో ఐఫోన్‌ల తయారీ ఊపందుకోవడమే.

ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజ సంస్థ టాటా భారత్‌లో యాపిల్‌ ఫోన్‌లను తయారు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. స్థానికంగా ఫోన్‌ల తయారీ జరిగితే యాపిల్‌ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఐఫోన్‌ తయార్‌ ప్లాంట్‌ను టాటా కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 5000 కోట్లు ఉంటుందని అంచనా. కర్ణాటకలో ఉన్న విస్ట్రాన్‌ కంపెనీకి చెందిన ప్లాంట్‌లో ఇప్పటికే ఐఫోన్‌ తయారీ జరుగుతోంది.

ప్రస్తుతం తైవాన్ దిగ్గజ కంపెనీలైన విస్ట్రోన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూపు భారత్‌లోని చెన్నైలో ఐఫోన్లను తయారుచేస్తోంది. టాటా గ్రూప్ విస్ట్రోన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లాన్‌లో ఉంది. ఈ డీల్‌ ఓకే అయితే టాటా కంపెనీ అరుదైన గౌరవం దక్కించుకోనుంది. ఐఫోన్లను తయారుచేయనున్న తొలి భారత కంపెనీగా అవతరించనుంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరి టాటా ఐఫోన్‌లను స్థానికంగా తయారు చేస్తే వాటి ధర భారీగా తగ్గనుంది. ఐఫోన్‌ల ధరలు సుమారు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు తగ్గే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు తగ్గడమే దీనికి కారణంగా చెబుతున్నారు. దీంతో టాటా, విస్ట్రాన్‌ల మధ్య ఒప్పందం అందరిలోనూ ఆసక్తినెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..