‘స్నాప్‌చాట్‌’లో మరో అద్భుత ఫీచర్

| Edited By:

Mar 18, 2019 | 4:59 PM

మల్టీమీడియా మెసీజింగ్ యాప్ స్నాప్‌చాట్ మరో కొత్తఫీచర్‌ను తీసుకురానుంది. ఆ యాప్‌లో గేమింగ్‌ ఫ్లాట్‌ఫాంను పరిచయం చేయనున్నారు. బయట తయారు కాబడిన గేమ్‌లను ఈ యాప్‌లో ఆడేందుకు స్నాప్‌చాట్‌ వెసులుబాటును కల్పించనుంది. వచ్చేనెల 4న లాస్‌ ఏంజిల్స్‌లో స్నాప్ పార్టనర్ సమ్మిట్‌ జరగనుంది. అందులో ‘‘తక్కువ మాట్లాడండి- ఎక్కువ ఆడండి’’(లెస్ టాక్. మోర్ ప్లే)అనే క్యాప్షన్‌తో ఈ కొత్త ఫీచర్‌ను స్నాప్‌చాట్ అధికారికంగా లాంచ్ చేయనుంది. ప్రాజెక్ట్ కోగ్‌నాక్ కింద ఈ ఫీచర్‌ను తయారు చేశారు కంపెనీ […]

‘స్నాప్‌చాట్‌’లో మరో అద్భుత ఫీచర్
Follow us on

మల్టీమీడియా మెసీజింగ్ యాప్ స్నాప్‌చాట్ మరో కొత్తఫీచర్‌ను తీసుకురానుంది. ఆ యాప్‌లో గేమింగ్‌ ఫ్లాట్‌ఫాంను పరిచయం చేయనున్నారు. బయట తయారు కాబడిన గేమ్‌లను ఈ యాప్‌లో ఆడేందుకు స్నాప్‌చాట్‌ వెసులుబాటును కల్పించనుంది. వచ్చేనెల 4న లాస్‌ ఏంజిల్స్‌లో స్నాప్ పార్టనర్ సమ్మిట్‌ జరగనుంది. అందులో ‘‘తక్కువ మాట్లాడండి- ఎక్కువ ఆడండి’’(లెస్ టాక్. మోర్ ప్లే)అనే క్యాప్షన్‌తో ఈ కొత్త ఫీచర్‌ను స్నాప్‌చాట్ అధికారికంగా లాంచ్ చేయనుంది. ప్రాజెక్ట్ కోగ్‌నాక్ కింద ఈ ఫీచర్‌ను తయారు చేశారు కంపెనీ డెపలపర్స్.

కాగా ‘స్నాప్‌‌‌‌‌‌పాబల్’ పేరుతో స్నాప్‌డీల్ గతేడాది ఓ గేమింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే అందులో ఏఆర్ గేమ్స్‌ను మాత్రమే ఆడుకునేందుకు అవకాశం ఉండేది. కానీ తాజా ఫీచర్‌తో బయటి గేమ్స్‌ను కూడా స్నాప్‌చాట్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. తమ వినియోగదారులను పెంచుకునేందుకు ఈ చైనా యాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఆరు నెలలో యాప్ రీ డిజైన్, డీలక్స్ బిట్‌మోసీ యాప్, స్నాప్ స్టోర్, కస్టమ్ జియోఫిల్టర్స్, షేర్ స్నాప్‌చాట్ స్టోరీస్ విత్ ఎనీవన్, గ్రూప్ వీడియో చాట్, ట్యాగింగ్, క్లియర్ చాట్‌ ఫీచర్ వంటి పలు ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.