స్మార్ట్ టీవీలు కొన్నారో ? మీ డేటా ఖతం !

స్మార్ట్ టీవీలు కొన్నారో ? మీ డేటా ఖతం !

స్మార్ట్ టీవీ ‘ స్మార్ట్ ‘ గా ఉంటుందని, త్వరగా మార్కెట్ కి వెళ్లి కొనేద్దామని అనుకుంటున్నారా ? అయితే కాస్త ఆగండి ! ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఈ రకం టీవీలు లేటెస్ట్ ఇన్నోవేషన్ కావచ్చు.. ఇంటర్నెట్ కనెక్షన్ తో కూడిన స్మార్ట్ టీవీలు నెట్ ఫ్లిక్స్ తదితర స్ట్రీమింగ్ సాధనాల పుణ్యమా అని హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కానీ వీటిలో భద్రతా పరమైన లోపాలు కూడా ఉన్నాయని ఎవరైనా గుర్తించారా ? చాలా […]

Pardhasaradhi Peri

|

Dec 04, 2019 | 5:12 PM

స్మార్ట్ టీవీ ‘ స్మార్ట్ ‘ గా ఉంటుందని, త్వరగా మార్కెట్ కి వెళ్లి కొనేద్దామని అనుకుంటున్నారా ? అయితే కాస్త ఆగండి ! ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఈ రకం టీవీలు లేటెస్ట్ ఇన్నోవేషన్ కావచ్చు.. ఇంటర్నెట్ కనెక్షన్ తో కూడిన స్మార్ట్ టీవీలు నెట్ ఫ్లిక్స్ తదితర స్ట్రీమింగ్ సాధనాల పుణ్యమా అని హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కానీ వీటిలో భద్రతా పరమైన లోపాలు కూడా ఉన్నాయని ఎవరైనా గుర్తించారా ? చాలా సెట్స్ లో కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఉన్నా.. అవి కస్టమర్లకు సెక్యూరిటీ హెచ్ఛరికలు ఇచ్ఛే స్థితిలో లేవట.. సాక్షాత్తూ అమెరికా లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీ ఐ) సంస్థే స్మార్ట్ టీవీల బండారాన్ని బయటపెట్టింది. వీటి సెక్యూరిటీ వ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేసింది. గుడ్డిగా వీటిని కొనవద్దని హెచ్ఛరించింది. తన వెబ్ సైట్ లో ఈ మేరకు ఇఛ్చిన వార్నింగ్ లో.. టీవీ ఉత్పత్తిదారులు, యాప్ డెవలపర్లు కూడా మిమ్మల్ని చూస్తూ, మీ మాటలను వింటూ ఉండవచ్ఛునని, పైగా హ్యాకర్లు సులభంగా మీ స్మార్ట్ టీవీ కంప్యూటర్లోకి చొరబడవచ్చునని పేర్కొంది. స్మార్ట్ టీవీ లాక్ చేసిన కంప్యూటర్లోకి సైబర్ నేరగాళ్లు నేరుగా యాక్సెస్ కాలేకపోయినప్పటికీ.. భద్రత లేని మీ టీవీ రూటర్ ద్వారా (దొడ్డిదారిన) యాక్సెస్ కావచ్చు.. తస్మాత్ జాగ్రత్త అని ఎఫ్ బీ ఐ హెచ్చరిస్తోంది. హ్యాకర్లు మైక్రోఫోన్ ను, కెమెరాను సులువుగా వినియోగించుకోవచ్ఛు.. అని ఈ సంస్థ పేర్కొంది. స్మార్ట్ టీవీలు హ్యాక్ కి గురి కావడం చాలా అరుదు. ఇందులోని సాఫ్ట్ వేర్ ఇందుకు కారణం. కానీ ఈ మధ్య కొందరు హ్యాకర్లు గూగుల్ కి చెందిన క్రోమ్ స్టాక్ స్ట్రీమింగ్ స్టిక్ ని, బ్రాడ్ కాస్ట్ వీడియోలను సులభంగా ఎలా హ్యాక్ చేయవచ్చో చూపారట. వ్యక్తుల ప్రయివసీకి భంగం కలిగిస్తున్నట్టు తెలియగానే స్మార్ట్ టీవీ మేకర్ ‘ విజియో ‘ పై ఇరవై లక్షల పైగా డాలర్ల జరిమానా విధించారు. ఇది కస్టమర్ల డేటాను సీక్రెట్ గా సేకరిస్తోందట. ఈ నేపథ్యంలో ఎఫ్ బీ ఐ ఓ సూచన చేస్తోంది. స్మార్ట్ టీవీ క్యామ్స్ ని కవర్ చేయాలనీ, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలని గట్టిగా సలహా ఇస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu