AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wi-Fi: ఇంట్లో వై-ఫై సరిగ్గా పనిచేయడం లేదా..? ఈ మూడు ట్రిక్స్‌‌తో వేగం మరింత పెరుగుతుంది..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇంట్లో వైఫై కనెక్షన్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. కొన్నిసార్లు వైఫై సరిగ్గా పనిచేయపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కనెక్షన్ మెరుగుపర్చుకోవచ్చు. వైఫై సరిగ్గా రాని సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Wi-Fi: ఇంట్లో వై-ఫై సరిగ్గా పనిచేయడం లేదా..? ఈ మూడు ట్రిక్స్‌‌తో వేగం మరింత పెరుగుతుంది..
Wifi Internet
Venkatrao Lella
|

Updated on: Aug 23, 2026 | 8:52 PM

Share

వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్క్ ఉద్యోగాలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. ఇక టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏ పనికైనా ఇంటర్నెట్ అనేది నిత్యావసరంగా మారిపోయింది. దీంతో ఇంట్లో వైఫై కనెక్షన్ తప్పనిసరి అయింది. అయితే కొన్నిసార్లు వైఫై స్లో అవ్వడం, సరిగ్గా పనిచేయకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీని వల్ల వైఫై పొందటంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక వర్క్ కోసమే కాకుండా స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్లు వంటి డివైస్‌లకు కూడా వైఫై కనెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో ఇంటర్నెట్ వేగం తగ్గడం, వైఫై నెమ్మదించడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో ఆఫీస్ వర్క్ చేసుకునే సమయంలో చిరాకు తెప్పిస్తుంది. ఇలాంటి సమయంలో కస్టమర్ కేర్‌కి కంప్లైంట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా మీరే రిపేర్ చేసుకోవచ్చు.

రూటర్ ఎక్కడ పెట్టాలి..?

ఇంటి మూలన, రూమ్ లోపల, బీరువా పక్కన, సిగ్నల్స్ సరిగ్గా రాని ప్రదేశాల్లో వైఫై రూటర్ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా తగ్గిపోతుంది. దీంతో రూటర్ అనే సిగ్నల్స్ బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఇంటి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. అల్మారాలు, మందపాటి గోలు సిగ్నల్స్ రాకుండా అడ్డుకుంటాయి. ఇక మైక్రోవేవ్ ఓవెన్, బ్లూటూత్ స్పీకర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా రూటర్ ఉంచాలి. ఇక సరిగ్గా ఇంటర్నెట్ రానప్పుడు రూటర్ రీస్టార్ట్ చేయాలి. రూటర్ నిరంతరం పనిచేయడం వల్ల వేడెక్కవచ్చు. దీని వల్ల ఇంటర్నెట్ పనితీరు దెబ్బతింటుంది. రూటర్ స్వి్చ్ ఆఫ్ చేసి ఒక నిమిషం ఆగాక మళ్లీ ఆన్ చేయాలి. ఇక వైఫైతో కనెక్ట్ అయిన అవసరం లేని పరికరాలను డిస్ కనెక్ట్ చేయండి.

కొత్త రూటర్ ఎంచుకోండి

ఇక మీ రూటర్ పాతైదే కొత్త రూటర్‌కు మారండి. పాత రూటర్లు స్మార్ట్ పరికరాలను ఒకేసారి సమర్ధవంతంగా నిర్వహించలేవు. దీంతో ఆధునిక టెక్నాలజీతో పనిచేసే కొత్త రూటర్‌కు మారండి. కొత్త రూటర్ తీసుకున్న తర్వాత కూడా మీ వైఫై సరిగ్గా పనిచేయకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను కలవండి. మీ ప్రాంతాల్లో ఏమైనా లైన్ లేదా సిగ్నల్ సమస్యలు ఉన్నాయేమోనని తనఖీ చేసుకోండి. ఇక సరైన వైఫై బ్యాండ్‌ను కూడా ఎంచుకోవాలి.  డ్యూయల్-బ్యాండ్  రూటర్ వాడుతున్నట్లయితే.. 2.4GHz , 5GHz అనే రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లు ఉంటాయి.  4K వీడియోలు చూడాలన్నా, ఆన్‌లైన్ గేమింగ్ ఆడాలన్నా, లేదా వీడియో కాల్స్ ఎలాంటి అంతరాయం లేకుండా సాగాలన్నా 5GHz బ్యాండ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Follow Us