Slice App: ‘యూజర్ల పర్సనల్ డేటాను ట్రాక్‌ చేస్తున్న స్లైస్‌ యాప్‌’… కంపెనీ స్పందన ఏంటంటే..

|

Jun 28, 2022 | 8:14 AM

Slice App: స్మార్ట్‌ఫోన్‌ల రాకతో యాప్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతీ అవసరానికి ఒక యాప్‌ పుట్టుకొస్తున్నాయి. పలు సంస్థలు కూడా తమ సేవలను విస్తరించుకునేందుకు యాప్‌లతో యూజర్లను..

Slice App: యూజర్ల పర్సనల్ డేటాను ట్రాక్‌ చేస్తున్న స్లైస్‌ యాప్‌... కంపెనీ స్పందన ఏంటంటే..
Follow us on

Slice App: స్మార్ట్‌ఫోన్‌ల రాకతో యాప్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతీ అవసరానికి ఒక యాప్‌ పుట్టుకొస్తున్నాయి. పలు సంస్థలు కూడా తమ సేవలను విస్తరించుకునేందుకు యాప్‌లతో యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో కొంతమంది సైబర్‌ నేరగాళ్లు యూప్‌ల ద్వారా యూజర్ల డేటాను కాజేస్తున్నారు. యాప్‌లలోకి మాల్వేర్‌లను ప్రవేశపెడుతూ డేటాను లాగేస్తున్నారు. అయితే దీనిపై గూగుల్ ఎప్పుడూ నిఘా పెడుతుంది. గూగుల్‌ ప్లే ప్రొటెక్టెట్‌ ద్వారా యాప్‌లను స్కాన్‌ చేసిన మాల్వేర్‌లు ఉన్న యాప్‌లను వెంటనే ప్లేస్టోర్ నుంచి డిలీట్‌ చేస్తాయి.

ఈ క్రమంలో తాజాగా క్రెడిక్ట్‌ కార్డ్‌లను అందించే స్లైస్‌.. యూజర్ల వ్యక్తిగత వివరాలను ట్రాక్‌ చేస్తుందని గూగుల్ ఆరోపించింది. యూజర్లు వెంటనే యాప్‌ను డిలీట్ చేయాలని సూచించింది. స్లైస్‌ యాప్‌ యూజర్ల పర్సనల్ డేటాతో పాటు, మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియో రికార్డింగ్స్‌, కాల్‌ హిస్టరీ ట్రాక్‌ చేయొచ్చు. అందుకే యాప్‌ను తొలగించండి అంటూ గూగుల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే గూగుల్‌ చేసిన ఈ ప్రకటనపై స్లైస్‌ సంస్థ అధికారికంగా స్పందించింది.

ఈ విషయమై వివవరణ ఇస్తూ.. ‘రెండు రోజుల క్రితం స్లైస్‌ యాప్‌ పర్సనల్ డేటాను ట్రాక్‌ చేస్తుందని ప్లేస్టోర్ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఆ సమస్యను గుర్తించిన కేవలం గంటల వ్యవధిలోనే పరిష్కరించాము. ఇప్పటికీ కొంత మంది పాత వెర్షన్‌ స్లైస్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వీరంత వెంటనే కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోండి’ అంటూ స్లైస్‌ సంస్థ వెల్లడించింది. దీంతో స్లైస్‌ సంస్థపై వస్తోన్న ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..